మాజీ ల‌వ‌ర్స్ మ‌ధ్య  కోల్డ్ వార్..!

ప్రేమ క‌థ‌లు విర‌హ వ్య‌థ‌లు మ‌ర‌చిపోలేని క‌ధ‌లు అంటారు పెద్ద‌లు.  సినిమా ఇండ‌స్ట్రీలో  ల‌వ్ స్టోరిస్  ఎలా పుడ‌తాయో.. ఎప్పుడు ఏ ట‌ర్న్ తీసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం ఎందుకంటే..  ఏ నిముషానికి ఏమి జ‌రుగునో ఎవ‌రు ఊహించ‌ద‌రో అన్న చందంగా ఇక్కడ రిలేష‌న్స్ వుంటాయి.  కెరీర్ ప్రారంభంలో న‌య‌న‌తార‌, శింబు తో క‌ల‌సి కొన్ని చిత్రాలు చేసింది. ఈ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింది. ఇద్ద‌రు  పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలారు.  లిప్ లాక్ ల‌తో  […]

Advertisement
Update:2015-09-02 00:31 IST

ప్రేమ క‌థ‌లు విర‌హ వ్య‌థ‌లు మ‌ర‌చిపోలేని క‌ధ‌లు అంటారు పెద్ద‌లు. సినిమా ఇండ‌స్ట్రీలో ల‌వ్ స్టోరిస్ ఎలా పుడ‌తాయో.. ఎప్పుడు ఏ ట‌ర్న్ తీసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం ఎందుకంటే.. ఏ నిముషానికి ఏమి జ‌రుగునో ఎవ‌రు ఊహించ‌ద‌రో అన్న చందంగా ఇక్కడ రిలేష‌న్స్ వుంటాయి.
కెరీర్ ప్రారంభంలో న‌య‌న‌తార‌, శింబు తో క‌ల‌సి కొన్ని చిత్రాలు చేసింది. ఈ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింది. ఇద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలారు. లిప్ లాక్ ల‌తో లీన‌మై వున్న ఫోటోటు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వీరిద్ద‌రు క‌ల‌సి న‌టించిన చిత్రాల్లో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రి చూస్తే.. రామ్ లీలా చిత్రంలో దీపిక ప‌దుకోణ్, రణ్వీర్ సింగ్ ల‌కంటే కూడా బావుంటుంది. క‌ట్ చేస్తే.. ఏడేళ్ల ప్రేమ‌యాణం సాగించిన త‌రువాత‌.. బ్రేక‌ప్ చెప్పుకున్నారు.

క‌ట్ చేస్తే 5 ఏళ్ల త‌రువాత శింబు ప్రస్తుతం నయనతారతో కలిసి’ఇదు నమ్మఆళు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రమే మరోసారి వీరి మధ్యన విభేధాలు పెరగటానికి కారణమవబోతోంది.తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం కొద్ది రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు నయనతార తాను ఇక సినిమాలో నటించనని తేల్చి చెప్పిందని సమాచారం. దాంతో వేరే దారి లేక చిత్రం హీరో శింబు ఆమెపై కంప్లైంట్ చేసారట‌.
శింబు రీసెంట్ గా తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ని కలిసి ఆమెపై కంప్లైంట్ చేసారు. ఆమె చిత్రం విషయంలో కోఆపరేట్ చేయకపోవటంతో చాలా నష్టపోవాల్సి వస్తుందని తెలియచేసారు. ఈ విషయమై నయనతార మీడియాతో మాట్లాడుతూ… “నేను ఈ చిత్రం కోసం ఇచ్చిన డేస్ ఇప్పటికే అయిపోయాయి. వారు వాటిని వాడుకోలేదు. ఇప్పుడు నేనే వేరే ప్రాజెక్టులలో పూర్తి బిజీగా ఉన్నాను. ఆ చిత్రం కోసం ఫ్రెష్ గా కాల్ షీట్స్ ఇచ్చే పరిస్ధితుల్లో లేను. అలా చేస్తే మిగతా నిర్మాతలకు ఇబ్బంది కలుగుతుంది ” అని ఆమె తేల్చి చెప్పారు. ఇంకా ఓ పాట,కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయట‌. న‌య‌న క‌నీసం త‌న మాజీ ల‌వ‌ర‌నే విష‌యాన్ని కూడా త‌న కెరీర్ కు సంబంధించినంత వ‌ర‌కు ప‌రిగ‌ణించ‌డం లేదంటే.. శింబు ప‌ట్ల త‌న‌కు ప్ర‌జెంట్ ఏ విధ‌మైన ఫీలింగ్ లేద‌ని క్లారీటి ఇచ్చిన‌ట్లే క‌దా.!

Tags:    
Advertisement

Similar News