రామ్ చరణ్ సినిమా టైటిల్ ఇదే..
అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కొత్త సినిమా పేరు విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మెగా హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా టైటిల్ ను విడుదల చేశాడు. తండ్రి మెగాస్టార్ షష్టిపూర్తి సందర్భంగా సినిమా టైటిల్ ను విడుదల చేస్తారని భావించినప్పటికీ.. అప్పుడే కేవలం టీజర్ వరకే పరిమితమైంది సినిమా యూనిట్. తాజాగా శ్రావణ శుక్రవారం, రక్షాభందన్ పండగల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా టైటిల్ తో మరో పోస్టర్ విడుదల చేశారు. రామ్ […]
Advertisement
అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కొత్త సినిమా పేరు విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మెగా హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా టైటిల్ ను విడుదల చేశాడు. తండ్రి మెగాస్టార్ షష్టిపూర్తి సందర్భంగా సినిమా టైటిల్ ను విడుదల చేస్తారని భావించినప్పటికీ.. అప్పుడే కేవలం టీజర్ వరకే పరిమితమైంది సినిమా యూనిట్. తాజాగా శ్రావణ శుక్రవారం, రక్షాభందన్ పండగల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా టైటిల్ తో మరో పోస్టర్ విడుదల చేశారు. రామ్ చరణ్ -శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా పేరు బ్రూస్ లీ. టైటిల్ చూస్తేనే ఇది పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థమైపోతుంది. గతంలో ఇదే సినిమాకు మై నేమ్ ఈజ్ రాజు, ఫైటర్, విజేత అనే పేర్లు అనుకున్నారు. వీటన్నింటినీ పక్కనపెట్టి ఫైనల్ గా బ్రూస్ లీ అనే పేరు కన్ ఫర్మ్ చేశారు. సినిమాలో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కృతి కర్బందా సినిమాలో చెర్రీకి అక్కగా కనిపించనుంది. ఈ సినిమాలో చిరంజీవి 15 నిమిషాల గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. అటు చాన్నాళ్ల తర్వాత ఇదే సినిమాతో ఇలియానా ఐటెంసాంగ్ చేస్తూ రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో మనముందుకు రాబోతోంది బ్రూస్ లీ సినిమా.
Advertisement