కొడుకును చంపేందుకూ ఇంద్రాణి కుట్ర!
పాము తనపిల్లలను తానే తింటుందన్న చందంగా డబ్బు రుచి మరిగిన ఇంద్రాణి తన రక్తం పంచుకుపుట్టన షీనాను చంపింది. అలాగే కొడుకు మిఖాయిల్‌ను కూడా మట్టుబెట్టేందుకు ప్రయత్నించిందని సమాచారం. దీంతో మొదటి నుంచి తమ మమ్మీ నన్ను చంపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోన్న మిఖాయిల్ అనుమానాలకు బలం చేకూరుతోంది. తాజాగా ఇదే విషయాన్ని ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా పోలీసుల విచారణలో అంగీకరించడం విశేషం. ఇంద్రాణి తనను ఎన్నోసార్లు కోల్‌కతా, ముంబై రావాలని కోరిందని, తాను […]
Advertisement
పాము తనపిల్లలను తానే తింటుందన్న చందంగా డబ్బు రుచి మరిగిన ఇంద్రాణి తన రక్తం పంచుకుపుట్టన షీనాను చంపింది. అలాగే కొడుకు మిఖాయిల్‌ను కూడా మట్టుబెట్టేందుకు ప్రయత్నించిందని సమాచారం. దీంతో మొదటి నుంచి తమ మమ్మీ నన్ను చంపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోన్న మిఖాయిల్ అనుమానాలకు బలం చేకూరుతోంది. తాజాగా ఇదే విషయాన్ని ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా పోలీసుల విచారణలో అంగీకరించడం విశేషం. ఇంద్రాణి తనను ఎన్నోసార్లు కోల్‌కతా, ముంబై రావాలని కోరిందని, తాను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. కోల్‌కతాలో మంచి ఉద్యోగం ఇప్పించడంతోపాటు జీవితంలో సెటిల్ చేస్తానని భరోసా ఇచ్చినా, ఆత్మప్రబోధం మేరకు తాను వెళ్లలేదని చెప్పారు. డబ్బు పంపడం ఆపేస్తానని బెదిరించినా, తాను తలొగ్గలేదని పేర్కొన్నారు.
షీనా, మిఖాయిల్ ఎవరి పిల్లలు?
ఇంద్రాణి గురించిన చీకటి కోణాలు ఒక్కోటిగా బయటికి వస్తున్నాయి. 16 ఏళ్లకే ఇంద్రాణి ఇంటి నుంచి పారిపోవడానికి ఆమె సవతి తండ్రి ఉపేంద్ర బోరానే లైంగిక వేధింపులే కారణమని ఐఎన్‌ఎక్స్ మాజీ సీఈవో వీర్‌సంఘ్వి సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఇంద్రాణి తనతో స్వయంగా చెప్పిందన్నారు. దీంతో ఇంద్రాణి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇంద్రాణి సంతానం షీరా, మిఖాయిల్ బర్త్ సర్టిఫికెట్లలోనూ తండ్రి స్థానంలో ఉపేంద్ర బోరా పేరుండటం బలం చేకూరుస్తోంది. ఈ ఆరోపణలను ఉపేంద్ర బోరా ఖండించాడు. సిద్దార్థ్ దాస్ కూడా ఇంద్రాణి పిల్లలకు తాను తండ్రి కాదని డీఎన్ ఏ పరీక్షలకు సిద్ధమయ్యాడని వార్తలు రావడంతో ఇంద్రాణి సంతానానికి తండ్రి ఎవరన్న ప్రశ్న ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. తన కూతురు కాదు కాబట్టే సంజీవ్ ఖన్నా షీనాను హత్యలో పాలుపంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య వెనక అనేక వాస్తవాలు వెల్లడి కావాల్సి ఉంది. ఆర్థిక కారణాలే షీనా హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే అది ఏ వ్యవహారం, హత్యకు దారి తీసిన పరిస్థితులేంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఆరుషి కేసులా కాకూడదు?
గతంలో దేశంలో సంచలనం సృష్టించిన ఆరుషి హత్యలో తొలుత తల్లిదండ్రులను విచారించిన పోలీసులు వారిని నిర్దోషులుగా తేల్చారు. అయితే ఈ కేసును సీబీఐ తిరగదోడటంతో కొత్త విషయాలు వెలుగుచూసి తిరిగి తల్లిదండ్రులను కోర్టు దోషులుగా తేల్చింది. కేసు విచారణ సరిగా జరగలేదని తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆరుషి తల్లిదండ్రులు అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. షీనా బోరా కేసు మునుముందు సరైన దిశలోనే వెళుతుందా అన్నది వేచి చూడాలి?
ఇంద్రాణికి శిక్షపడుతుందా?
శుక్రవారం షీనా అస్థికలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీటి ద్వారా హత్య కు కారణాలు సాంకేతికంగా నిరూపించలేమని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. షీనా హత్య జరిగింది వాస్తవం, ఆమెను తల్లి ఇంద్రాణి చంపిందన్నది వాస్తవం. అయితే ఇవన్నీ ప్రాథమిక ఆధారాలు. కోర్టుకు స్పష్టమైన ఆధారాలు కావాలి? అవి ఇంద్రాణిని దోషి అని తేల్చగలగాలి. ఇప్పుడు కేసు అంగీకరించినా.. కోర్టులో మాటమార్చదని గ్యారంటీ లేదు. పోలీసులు బలమైన ఆధారాలు సమర్పించకుంటే.. ఈ కేసు నుంచి బయటపడటం ఇంద్రాణికి పెద్ద సమస్య కాదు. ఒకవేళ తగిన సాక్ష్యాలు దొరికినా, ఈ ఉదంతంలో కేవలం ఒక హత్య కేసే కాదు, పలు కుట్ర, ఆర్థిక కోణాలు దాగి ఉన్నాయి. మూడు రాష్ర్టాల పరిధిలో నేరాలు జరిగాయి. వారంతా కలిసి ఒకే సమయంలో వివిధ రాష్ర్టాల్లో కోర్టులకు హాజరు కావాలి. లేదా ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ నిరూపితమయ్యేందుకు ఎంతలేదన్నా.. పుష్కర కాలంపైనే పడుతుంది. ఆ లోపు ఇంద్రాణి, పీటర్, సంజీవ్, మిఖాయిల్, డ్రైవర్ శ్యాంవర్ ఇతర నిందితులు ఎవరు జీవించి ఉంటారు? ఎవరు మరణిస్తారో ? దేవుడికే తెలియాలి.
Advertisement