భవనాల క్రమబద్దీకరణకు సిఫార్సులివ్వండి: కేసీఆర్ ఆదేశం
కొత్తగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం క్రమపద్ధతిలో ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉమ్మడి పాలనలో అస్తవ్యస్తంగా తయారైన నగరాన్ని చక్కదిద్దుకోవాలని చెప్పారు. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌ను చావుమీదికి తెచ్చుకుని మరీ దక్కించుకున్నామని, అలాంటి నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. నగరంలో భూముల క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, కొత్త నివాసాలకు అనుమతులు ఇచ్చే విధానం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ సంస్థల పనితీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]
Advertisement
కొత్తగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం క్రమపద్ధతిలో ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఉమ్మడి పాలనలో అస్తవ్యస్తంగా తయారైన నగరాన్ని చక్కదిద్దుకోవాలని చెప్పారు. తెలంగాణకు గుండెకాయలాంటి హైదరాబాద్‌ను చావుమీదికి తెచ్చుకుని మరీ దక్కించుకున్నామని, అలాంటి నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. నగరంలో భూముల క్రమబద్ధీకరణ, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, కొత్త నివాసాలకు అనుమతులు ఇచ్చే విధానం, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ సంస్థల పనితీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌పై సరైన నిర్ణయం తీసుకోవడానికి అధికారులు తగు సిఫారసులు చేయాలని సూచించారు. హైదరాబాద్‌తోపాటు ఉమ్మడి పాలకులు అవలంబించిన విధానాల పాపాలుకూడా వారసత్వంగా వచ్చాయని అన్నారు. నగరంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలపై సమీక్షించాలని, భవిష్యత్తులో ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు లేకుండా కొత్తగా భూమి, భవనాల నిర్మాణ విధానాన్ని పటిష్ఠంగా తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని సీఎం నొక్కి చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షించుకుంటూ నగరాన్ని తీర్చిదిద్దుకోవాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అక్రమంగా వెలిసిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలగురించి సమీక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వాటిని కూలగొట్టడం ఉపయోగమా? క్రమబద్ధీకరించడం ఉపయోగమా? వాటి పర్యవసానాలు ఏమిటి? అనే విషయంపై అన్ని కోణాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Advertisement