ఆ హీరోపై లెజెండ్ పాప కాంట్రవర్సరీ కామెంట్స్..
‘లెజెండ్’ మూవీతో ఒక్కసారిగా పాపులారిటీ పొందిన హీరోయిన్ రాధికా ఆప్టే…. ఏదో విధంగా ఎప్పుడు మీడియాలో నలుగుతూ ఉంటుంది. అదొ తరహా ప్రచారం. హీరోయిన్స్ కు అది బాగా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయం రాధిక ఆప్టే బాగ గ్రహించినట్లుంది. అందుకే ఎప్పుడు ఏదోక వివాదస్పద స్టేట్ మెంట్ ఇస్తూనే వుంటుంది. వెంటనే మీడియాలో తగిన ప్రచారం గెయిన్ చేస్తుంటుంది. తాజగా ఈ హాట్ బ్యూటీ మరో కాంట్రవర్సరీ స్టేట్ […]
Advertisement
‘లెజెండ్’ మూవీతో ఒక్కసారిగా పాపులారిటీ పొందిన హీరోయిన్ రాధికా ఆప్టే…. ఏదో విధంగా ఎప్పుడు మీడియాలో నలుగుతూ ఉంటుంది. అదొ తరహా ప్రచారం. హీరోయిన్స్ కు అది బాగా ప్లస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయం రాధిక ఆప్టే బాగ గ్రహించినట్లుంది. అందుకే ఎప్పుడు ఏదోక వివాదస్పద స్టేట్ మెంట్ ఇస్తూనే వుంటుంది. వెంటనే మీడియాలో తగిన ప్రచారం గెయిన్ చేస్తుంటుంది. తాజగా ఈ హాట్ బ్యూటీ మరో కాంట్రవర్సరీ స్టేట్ మెంట్ ఇచ్చింది.
‘బద్లాపూర్’ మూవీలో వరుణ్ ధావణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది రాధికా ఆప్టే. అప్పట్నించీ వరుణ్ కి సన్నిహితంగా మెలుగుతోందట రాధికా. అయితే రీసెంట్ గా వరుణ్ కు మీకు ఉన్న రిలేషన్ ఏంటని, ఆమెను అడిగే సరికీ… ‘అతనికీ నాకు మధ్య ఓ స్పెషల్ రిలేషన్ ఉంది’ అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చిందట. అంతేకాదు వరుణ్ యాటిట్యూడ్ తనకి చాలా ఇష్టమని, అతనితో కలిసి యాక్ట్ చేస్తే ఎంతో కంఫర్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది! ఇది ఇలా ఉంటే కాంట్రవర్సరీలనే తన పబ్లిసిటీ కంటెంట్ గా వాడుకునే రాధికాఆప్టే…. ఈసారి వరుణ్ ధావన్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టుందని బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Advertisement