తెలంగాణలో కొత్తగా 40 మండలాలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న మండలాలను పునర్విభజన చేసి కొత్తగా 40 మండలాలను ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ నిర్ణయించింది. కొత్త మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని రెవిన్యూ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. పాతికేళ్ల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా ఏర్పడిన మండలాలను పునర్విభజన చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కో మండలానికి 50 వేల మంది జనాభా మించకుండా ఉండేలా పునర్వ్యవస్థీకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ప్రతి జిల్లాలోనూ కొత్తగా […]
Advertisement
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతమున్న మండలాలను పునర్విభజన చేసి కొత్తగా 40 మండలాలను ఏర్పాటు చేయాలని టీ.సర్కార్ నిర్ణయించింది. కొత్త మండలాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని రెవిన్యూ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపారు. పాతికేళ్ల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా ఏర్పడిన మండలాలను పునర్విభజన చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఒక్కో మండలానికి 50 వేల మంది జనాభా మించకుండా ఉండేలా పునర్వ్యవస్థీకరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ప్రతి జిల్లాలోనూ కొత్తగా రెండు మూడు మండలాలు ఏర్పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement