వైకుంఠ ఏకాదశి.. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు
Advertisement
ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్ద ఎత్తున వస్తున్న వస్తున్న భక్తుల కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయ ప్రాంగణం, ప్రసాదాల కౌంటర్ల వద్ద భక్తుల సందడి నెలకొన్నది.
Advertisement