ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే?

వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం

Advertisement
Update:2025-01-10 05:17 IST

వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువును వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు తరలివస్తారు. ఆ రోజున స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ముర అనే రాక్షసుడి బాధలు భరించలేక దేవతలు విష్ణువును ప్రార్థిస్తారు. దీంతో స్వామివారు అతనితో పోరుకు సిద్ధమయ్యాడు. దీన్ని తెలుసుకున్న ముర సముద్రంలోకి వెళ్లిపోతాడు. విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్లి నిద్రిస్తున్న సమయంలో ముర ఆ గుహలోకి వస్తాడు. ఆ సమయంలో స్వామి దేహం నుంచి ఒక శక్తి వచ్చి మురను చంపివేసింది. శక్తి చర్యకు సంతుష్టుడైన స్వామి ఆమెకు ఏకాదశి అని పేరు పెడతారు. ఆమెను ఏదైనా వరం కోరుకోమనగా మురను చంపిన రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పోగొట్టాలని ఏకాదశి ప్రార్థించింది. స్వామి తథాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడు.

మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు స్వచ్ఛంద మరణం వరాన్ని పొంది లోక కంటకులుగా మారారు. బ్రహ్మ వినతి మేరకు మహావిష్ణువు వారితో యుద్ధానికి దిగాడు. అయితే వారు వరం చేత ఓడిపోవడం లేదు. దీన్ని గ్రహించిన స్వామి వారికి వరమిస్తామనగా వారు గర్వాతిశయంతో మేముం వరమిస్తాం కోరుకోమన్నారు. అయితే మీరు నాతో మరణం పొందాలి అని స్వామి అడిగాడు. అనంతరం వారిని సంహరించిన స్వామి వారిని వైకుంఠ ఉత్తరద్వారం నుంచి పరమపదంలోకి తీసుకెళ్లాడు. మధుకైటభులు చేయని దుర్మార్గం లేదు. అయినా వారు తాము ఇచ్చిన మాట ప్రకారం ఆ వైకుంఠ నాథుని చేతిలో కన్నుమూశారు. అందుకనే స్వామి వారి పాపాలను కడిగివేశాడు. వైకుంఠంలో స్థానమిచ్చాడు.

ఉత్తర ద్వార దర్శనం అంటే

శ్రీమహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠానికి చేరుకోవాలని యుగయుగాల నుంచి కోట్లాది మంది భక్తులు ఆశిస్తుంటారు. అయితే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకోవాలా లేదా స్తోత్రం చేయాలా లేదా సేవలు అందించాలా అన్న సందేహాలు వస్తుంటాయి. ఉత్తర ద్వారం తప్ప మిగిలిన ద్వారాల నుంచి వైకుంఠానికి వెళితే కొంతకాలం మాత్రమే ఉండవచ్చు. కానీ ఉత్తర ద్వారం నుంచి వెళితే స్వామి వారి కైంకర్యాల కోసం అక్కడే ఉండవచ్చు. ఏ భక్తుడికైనా అంతకంటే కావాల్సింది ఏముంది. అందుకే కైంకర్యాలు అంటే సేవల కోసం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉండి ఆ పద్మనాభుడి సేవల్లో నిత్యం పాల్గొనవచ్చు

Tags:    
Advertisement

Similar News