పవన్ సినిమా మరోసారి ఆలస్యం
ఏ ముహూర్తాన గబ్బర్ సింగ్-2 ప్రాజెక్ట్ స్టార్టయిందో కానీ అప్పట్నుంచి అది పడుతూ లేస్తూనే సాగిపోతోంది. ఇప్పటికే దాదాపు రెండేళ్లయింది ఆ సినిమా అనుకొని. ఎట్టకేలకు ఈ మధ్యే ఇది సెట్స్ పైకి వచ్చింది. ఎన్నో అవాంతరాలు దాటి సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాపై ఇప్పుడు మరోసారి నల్లమబ్బులు కమ్ముకున్నాయి. సినిమా ఇంకాస్త ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది. దీనికి కారణం పవన్ కల్యాణ్ ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో పర్యటనకు రంగం సిద్ధం చేసుకోవడమే. ఏపీ నూతన […]
Advertisement
ఏ ముహూర్తాన గబ్బర్ సింగ్-2 ప్రాజెక్ట్ స్టార్టయిందో కానీ అప్పట్నుంచి అది పడుతూ లేస్తూనే సాగిపోతోంది. ఇప్పటికే దాదాపు రెండేళ్లయింది ఆ సినిమా అనుకొని. ఎట్టకేలకు ఈ మధ్యే ఇది సెట్స్ పైకి వచ్చింది. ఎన్నో అవాంతరాలు దాటి సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమాపై ఇప్పుడు మరోసారి నల్లమబ్బులు కమ్ముకున్నాయి. సినిమా ఇంకాస్త ఆలస్యమయ్యేట్టు కనిపిస్తోంది. దీనికి కారణం పవన్ కల్యాణ్ ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో పర్యటనకు రంగం సిద్ధం చేసుకోవడమే.
ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ఓ సారి పర్యటించారు పవన్. రైతులు స్వచ్ఛందంగా భూములిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసిన జనసేనాని, ప్రభుత్వం బలవంతంగా రైతుల నుంచి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తే మాత్రం ఉద్యమిస్తానని ప్రకటించాడు. ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. రైతుల నుంచి భూమి తీసుకునేందుకు భూసేకరణ చట్టం ప్రయోగించింది ఏపీ సర్కార్. దీంతో పవన్ హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు. తన సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో ఉన్నారు. అక్కడి రైతులతో మాట్లాడి, వాళ్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు. రైతులకు తన పట్ల వ్యతిరేక భావం కలగకుండా, సేమ్ టైం ప్రభుత్వానికి కూడా తనపై వ్యతిరేక భావం కలగకుండా మధ్యేమార్గంగా వెళ్లాలనుకుంటున్నారు పవన్.
Advertisement