చిరంజీవి ఏం చెప్పారంటే...
మెగాస్టార్ వెండి తెరమీద ఎమి చేస్తాడు..ఎలా చేస్తాడు.. దాని గురించి మళ్లీ మళ్లీ చెప్పనసవరం లేదు. అయితే చిరు గురించి చాల మందికి కొన్ని విషయాలు ఆయన 60 వ బర్డ్ డే సందర్భంగా మీకోసం… ఇష్టమైన హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జగదేగ వీరుడు-అతిలోక సుందరి చిత్రం ఒక క్లాసిక్‌గా నిలిచింది. ఈ మధ్యనే పాతికేళ్ల సంబరం జరుపుకుంది. ఆమే గొప్ప నటి ..అంతకు మించి బ్యూటీఫుల్ అండ్ […]
Advertisement
మెగాస్టార్ వెండి తెరమీద ఎమి చేస్తాడు..ఎలా చేస్తాడు.. దాని గురించి మళ్లీ మళ్లీ చెప్పనసవరం లేదు. అయితే చిరు గురించి చాల మందికి కొన్ని విషయాలు ఆయన 60 వ బర్డ్ డే సందర్భంగా మీకోసం…
ఇష్టమైన హీరోయిన్
మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జగదేగ వీరుడు-అతిలోక సుందరి చిత్రం ఒక క్లాసిక్‌గా నిలిచింది. ఈ మధ్యనే పాతికేళ్ల సంబరం జరుపుకుంది. ఆమే గొప్ప నటి ..అంతకు మించి బ్యూటీఫుల్ అండ్ వృత్తి పట్ల నిబద్దత కలిగిన పర్సన్ అంటూ శ్రీదేవి అంటే ఆయనకున్న అభిమానాన్ని తెలియజేశారు.
ఇష్టమైన పాట
చిరు చిత్రాల్లో పాటలు కొన్ని లక్షల మంది అభిమానులు పాడుకుంటారు. మరి మెగాస్టార్‌కు ఇష్టమైన పాటలు ఏమిటంటే చెప్పడం కొంచెం కష్టమే… చిరుకు ఆయన చేసిన రుద్రవీణ చిత్రంలో పాటలంటే చాలా ఇష్టమట. ఈ చిత్రంలో పాటలు తనతోపాటు తన సతీమణి సురేఖకు కూడా చాలా ఇష్టమట.
అపుడు చేయలేక పోయినవి …ఇపుడు..
సినిమాల్లోను, రాజకీయాల్లోను బిజీగా ఉన్నంత కాలం.. ఆయన కొన్ని పనులు చేయలేక పోయారట. అవన్నీ ఈ మధ్య రాజకీయంగా, సినిమాల పరంగా దొరికిన గ్యాప్‌తో చేసేస్తున్నారట.
చేతి రాత బాగుండదట
నా చేతి రాత అస్సలు బావుండదు. ఎంత బావుండదంటే… నేను రాసిన దాన్ని మళ్లీ నేనే చదవలేను. ఇప్పుడు చేతి రాతను మళ్లీ ప్రాక్టీసు చేస్తున్నాను.
మెదడకు మేత కోసం…
అబాకస్, సుడోకు అబాకస్, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ నేర్చుకుంటున్నట్లు, వీటిద్వారా మెదడు చురుకుగా తయారవుతుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఫోటో గ్రఫీ పిచ్చి..
నా హాబీ ఫొటోగ్రఫి. నాకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కెమెరాలు కొనుక్కోలేకపోయా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అదొక హాబీగా మారిపోయింది.
ఇవన్ని చిరు గురించి అభిమానులకు పెద్దగా తెలియని విషయాలు.
ఇక తన 150వ సినిమా సరైన స్క్రిప్టు దొరకక పోవడం వల్లనే ఆలస్యం అవుతోందని చిరంజీవి తెలిపారు. సినిమా సబ్జెక్ట్ అందరినీ అలరించే విధంగా, అభిమానులు, ప్రేక్షకులు తన నుండి కోరుకునే అన్ని అంశాలతో ఉండాలన్నారు. పాలిటిక్స్‌లో పెద్దగా రాణించలేక పోయినా.. సినిమాల్లో మెగాస్టార్‌గా సక్సెస్ అయ్యారు. ఆయన మరికొంత కాలం అభిమానుల్ని అలరించాలని.. ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ…. తెలుగు గ్లోబల్ డాట్ కమ్ తరుపున మరోసారి జన్మదిన శుభాకాంక్షలు.
Advertisement