గూగుల్ లో ప్రభాస్.. ఫేస్ బుక్ లో బాహుబలి...
బాహుబలి ప్రారంభానికి ముందు.. ప్రభాస్ ఈ సినిమా గురించి ఏమి ఆలోచించుకున్నాడో.. రెండు సంవత్సరాలు పడుతుందని తెలిసినా ఎందుక డేట్స్ ఇచ్చాడో….. ఇప్పుడు అందరీకి అర్ధం అయ్యింటుంది. అంటే అందరికంటే ముందే బాహుబలి చిత్రం ఒక గొప్ప సినిమా అవుతుందని ఆయన రాజమౌళి కథ చెప్పినప్పుడే ఊహించడం అనేది చాల గొప్ప విషయం. దీంతో ప్రభాస్ మంచి జడ్జి అని నిరూపించుకున్నాడు. ఇక ఇదిలా వుంటే బాహుబలి మన తెలుగు తో పాటు..మరో నాలుగు లాంగ్వేజెస్ […]
Advertisement
బాహుబలి ప్రారంభానికి ముందు.. ప్రభాస్ ఈ సినిమా గురించి ఏమి ఆలోచించుకున్నాడో.. రెండు సంవత్సరాలు పడుతుందని తెలిసినా ఎందుక డేట్స్ ఇచ్చాడో….. ఇప్పుడు అందరీకి అర్ధం అయ్యింటుంది. అంటే అందరికంటే ముందే బాహుబలి చిత్రం ఒక గొప్ప సినిమా అవుతుందని ఆయన రాజమౌళి కథ చెప్పినప్పుడే ఊహించడం అనేది చాల గొప్ప విషయం. దీంతో ప్రభాస్ మంచి జడ్జి అని నిరూపించుకున్నాడు.
ఇక ఇదిలా వుంటే బాహుబలి మన తెలుగు తో పాటు..మరో నాలుగు లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చిత్రంగా ఒకేసారి రిలీజ్ చేశారు. అందులో కన్నడ లాంగ్వేజ్ కూడా ఉంది. చిన్న ఇండస్ట్రీ అయినా.. చింత లేని ఇండస్ట్రీ… అక్కడ భారీ బడ్జెట్ చిత్రాలుండవు. అయితే కన్నడంలో కూడా మన బాహుబలి డబ్బింగ్ వెర్సన్ లో రిలీజ్ అయ్యింది. బెంగళూరు లో తెలుగు వారు ఎక్కువ మంది వుంటారు కాబట్టి..అల్రేడి అక్కడ తెలుగు వెర్సన్ కూడా విడుదల చేశారు.
ఇక దేశ వ్యాప్తంగా మన బాహుబలి విడుదలైన చొటంతట విజయ ఢంకా మోగించింది. ఇక తాజా విశేషం ఏమిటంటే.. బాహుబలి ఫేస్ బుక్ లైక్స్ రెండు మిలియన్స్ క్రాస్ అయ్యిందట. ఈ సందర్భంగా రాజమౌళి లైక్ చేసిన వారిందరికి సోషల్ నెట్ వర్క్ లో థ్యాంక్స్ చెప్పారు. బాహుబలి ప్రారంభం నుంచి ఈ సినిమాకు స్పెషల్ గా ఒక ఖాతా ఒకటి ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు కర్ణాటక లో గూగుల్ మోస్ట్ సెర్చిడ్ పర్సన్ గా ప్రభాస్ పేరు వచ్చిందట. బాహుబలి తో నేషనల్ వైడ్ ప్రభాస్ క్రేజ్ సంపాదించాడు అనడానికి ఇదే నిదర్శనం. ఈ రోజు ప్రభాస్ కు వస్తున్న గుర్తింపు వెనక బాహుబలి మొదటి పార్ట్ కోసం ప్రభాస్ పడిన శ్రమ ఎంతో ఉంది మరి. నిజంగా కష్టే ఫలి అంటే ఇదే కదా..!
Advertisement