మహేష్ కు ఆ రోజు నిద్రపట్టలేదట...!
మహేష్ బాబు. ఒక పేరు కాదు బ్రాండ్ అంటారు ఆయన అభిమానులు. కెరీర్ పరంగా డోకా లేదు. ఇవి బయటకు కనిపించే అంశాలు. కానీ, ఫెయిల్యూర్సర్ అనేవి ఎంత పెద్ద స్టార్ కైనా నిద్ర లేకుండా చేస్తాయనడానికి మహేష్ బాబు ఒక ఎగ్జాంపుల్ మరి. గత యేడాది చేసిన రెండు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరచడంతో… శ్రీమంతుడు సినిమా తో ఎలాగైన హిట్ కొట్టాలనే ఆశ […]
Advertisement
మహేష్ బాబు. ఒక పేరు కాదు బ్రాండ్ అంటారు ఆయన అభిమానులు. కెరీర్ పరంగా డోకా లేదు. ఇవి బయటకు కనిపించే అంశాలు. కానీ, ఫెయిల్యూర్సర్ అనేవి ఎంత పెద్ద స్టార్ కైనా నిద్ర లేకుండా చేస్తాయనడానికి మహేష్ బాబు ఒక ఎగ్జాంపుల్ మరి. గత యేడాది చేసిన రెండు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరచడంతో… శ్రీమంతుడు సినిమా తో ఎలాగైన హిట్ కొట్టాలనే ఆశ తో చేశారు. ఆఫ్ కోర్స్ ప్రతి సినిమా హిట్ కావాలనే చేస్తారు. అయితే ఫైనల్ గా ప్రేక్షక దేవుళ్లు ఏ కథకు బ్రహ్మ రధం పడతారో..! ఏ కథను తిరస్కరిస్తారో! ఎవరు అంచనా వేయలేరు. అలా తెలిస్తే.. ప్రతి ఒక్కరు హిట్ చిత్రాలే చేస్తారు . నిజమే కదా..!?
అయితే లాస్ట్ ఇయర్ మహేష్ చేసిన '1 నేనొక్కడినే'.. ఆ తరువాత శీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన 'ఆగడు'చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో… మహేష్ బాబుకు శ్రీమంతుడు చిత్రం రిలీజ్ రోజు నిద్ర పట్టలేదట. ఎందుకంటే అల్రేడి రెండు ఫెయిల్యూర్స్ వున్నాయి. ఈ చిత్రం కథ సింపుల్ గా ఉంటుంది. ప్రేక్షక దేవుళ్లు ఏ విధమైన తీర్పు ఇస్తారో…! రిజల్ట్ ఎలా వుంటుందో అని సినిమా విడుదలైన రోజు రాత్రంతా ఒక విధమైన భయంతో కూడిన ఆందోళన లో వున్నారట. అయితే విడుదలైన రోజు ఉదయం ఆట నుంచి శ్రీమంతుడు సూపర్, బ్లాక్ బస్టర్ అని ఫీడ్ బ్యాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడట. చూశారా !? .. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకు ఫెయిల్యూర్స్ ఎంతటి భయాన్ని క్రియోట్ చేశాయో.. కేవలం ఇది ప్రిన్స్ విషయంలో అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. మహేష్ ఓపెన్ గా చెప్పారు. మిగిలిన వాళ్లు చెప్పక పోయినా.. వరసగా రెండు ఫెయిల్యూర్స్ పడితే ఒకింత వర్రీ అవుతారనడంలో సందేహాం లేదు మరి. ఎనీ వే తొలిసారిగా ప్రొడ్యూసర్ గా కూడా మహేష్ సక్సెస్ కావడం ఫ్యాన్స్ కు..ఇండస్ట్రీకి శుభ సూచికమే కదా.! మొదటి వారం పూర్తి అయ్యే సరికి ఈ చిత్రం షేర్స్ 70 కోట్లు దాటినట్లు ట్రేడ్ టాక్.
Advertisement