ప్రభాస్ చెర్రి కలయికలో కొత్త సినిమా...?
హిందిలో నిన్న రిలీజైన బ్రదర్స్ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ కానుందని టాలీవుడ్‌లో అపుడే ప్రచారం మొదలైంది. హీరో ప్రభాస్, రాంచరణ్‌లతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి రానా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రానా, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి-1 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే! మరోసారి అదే కాంబినేషన్ రిపీటైతే నిర్మాతలకు కాసుల పంటే. ఇద్దరూ ఆరడుగులకుపైగా ఎత్తుతో, కండలు తిరిగిన దేహాలతో గ్రీకుశిల్పాల్లా ఉంటారు. అయితే […]
Advertisement
హిందిలో నిన్న రిలీజైన బ్రదర్స్ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ కానుందని టాలీవుడ్‌లో అపుడే ప్రచారం మొదలైంది. హీరో ప్రభాస్, రాంచరణ్‌లతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి రానా పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రానా, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి-1 ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే! మరోసారి అదే కాంబినేషన్ రిపీటైతే నిర్మాతలకు కాసుల పంటే. ఇద్దరూ ఆరడుగులకుపైగా ఎత్తుతో, కండలు తిరిగిన దేహాలతో గ్రీకుశిల్పాల్లా ఉంటారు. అయితే ప్రభాస్, చెర్రి కాంబినేషన్ లోనే రావచ్చు అని, బాలీవుడ్ లో షూటింగ్ మొదలైనప్పటి నుంచే దీనిపై చెర్రి ఆసక్తి కనబరిచినట్టు ఫిలిం నగర్ టాక్. ఇక ప్రభాస్, చెర్రి కాంబోలో ఇలా సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటినుంచే ఇద్దరు హీరోల అభిమానులకు ఆనందానికి హద్దే ఉండకపోవచ్చు. అయితే బాహుబలి 2 సినిమా తరువాతే దీనిపై ఒక క్లారిటి రావచ్చేమో చూడాలి మరి.
Advertisement