మొన్న పవన్ కళ్యాణ్,మహేష్ ఇప్పుడు ప్రభాస్...
కొన్ని సినిమాలు హీరోల కెరీర్ ను ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. తాజాగా ప్రభాస్ కెరీర్ ను బాహుబలి చిత్రం శిఖర స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు దీన్ని నిలపుకోవాల్సిన బాధ్యత ప్రభాస్ ది. కట్ చేస్తే .. బాహుబలి ఒక అంతర్జాతీయ సినిమా గా ప్రశంసలు అందుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక ఐడియా జీవితాన్ని మార్చి వేసినట్లు.. బాహుబలి ఒక్క చిత్రం ప్రభాస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇప్పటి వరకు కేవలం తెలుగు వారికి […]
Advertisement
కొన్ని సినిమాలు హీరోల కెరీర్ ను ఊహించని స్థాయికి తీసుకెళ్తాయి. తాజాగా ప్రభాస్ కెరీర్ ను బాహుబలి చిత్రం శిఖర స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు దీన్ని నిలపుకోవాల్సిన బాధ్యత ప్రభాస్ ది. కట్ చేస్తే .. బాహుబలి ఒక అంతర్జాతీయ సినిమా గా ప్రశంసలు అందుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక ఐడియా జీవితాన్ని మార్చి వేసినట్లు.. బాహుబలి ఒక్క చిత్రం ప్రభాస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఇప్పటి వరకు కేవలం తెలుగు వారికి మాత్రమే తెలిసిన ప్రభాస్..బాహుబలితో ఇంటర్నేషనల్ గా పరిచయమయ్యాడు
అయితే ప్రభాస్ కు తాజాగా ఒక నేషనల్ వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రముఖ వాహన తయారి సంస్థ మహీంద్రా..తమ సంస్థ ఉత్తత్పి చేస్తున్నర XUV500 కు ప్రభాస్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించికున్నట్లు సమాచారం. మహీంద్రా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్ర బాహుబలి సినిమా చూసి ముగ్దుడై పోయాడు. ఇండియన్ సినిమా పరిశ్రమ సత్తా చాటేలా ఉందని, హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోలేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన దృష్టి ప్రభాస్ మీద పడిందని , ఆయన సూచన మేరకే కంపెనీ ప్రతినిధులు ప్రభాస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి దీనికి ఒప్పుకోలేదని ఫిలిం నగర్ టాక్. ఒకవేళ రాజమౌళి ఒప్పుకొని ఈ న్యూస్ ఒకే అయితే ప్రభాస్ బాలీవుడ్ స్థాయిలో ఒక స్థానం ఏర్పర్చుకున్నట్టే. ఇక ఇప్పటి వరకు వాణిజ్య ప్రకటనలు చేసిన తెలుగు హీరోల్లో పవన్ , మహేష్ తరువాత ప్రభాస్ కే ఆ చాన్స్ దక్కినట్లే మరి.
Advertisement