నాగం మరో కొత్త పార్టీ!
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో.! ఒకప్పుడు వెలుగు వెలిగిన నాయకులు మరోపార్టీకి వెళ్లేంతవరకు బాగానే ఉంటుంది. తీరా వెళ్లాకే తమ కంటే జూనియర్ల కింద పనిచేయాల్సి రావడం, వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో మనస్సు చివుక్కుమంటుంది. తాజాగా నాగం జనార్ధన్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టీడీపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నాగం.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్‌కు చంద్రబాబు పక్షాన వెళ్లిన సమయంలో విద్యార్థులు ఆయన్ను చంపినంత పనిచేశారు. దీంతో ఉద్యమ […]
Advertisement
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో.! ఒకప్పుడు వెలుగు వెలిగిన నాయకులు మరోపార్టీకి వెళ్లేంతవరకు బాగానే ఉంటుంది. తీరా వెళ్లాకే తమ కంటే జూనియర్ల కింద పనిచేయాల్సి రావడం, వారు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో మనస్సు చివుక్కుమంటుంది. తాజాగా నాగం జనార్ధన్‌రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. టీడీపీలో ఒకప్పుడు చక్రం తిప్పిన నాగం.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా క్యాంపస్‌కు చంద్రబాబు పక్షాన వెళ్లిన సమయంలో విద్యార్థులు ఆయన్ను చంపినంత పనిచేశారు. దీంతో ఉద్యమ తీవ్రత అర్థం చేసుకున్న నాగం అధినేత చంద్రబాబుకు క్రమంగా దూరమయ్యారు.
మూణ్ణాళ్ల ముచ్చటగా సొంత కుంపటి!
ఎన్నికల ముందు టీడీపీ కాకుండా ఏదో ఒక వేదికను ఎంచుకోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ పార్టీలోకి వెళ్లలేక పోయారు. ఇక కాంగ్రెస్‌లోకి వెళితే భవిష్యత్తు ఉండదని తెలుసు. కొంతకాలం తెలంగాణ నగారా పేరిట సొంతకుంపటి పెట్టారు. దాన్ని నడపడం ఆయనకు తలకు మించిన భారం అయింది. అదే సమయంలో దేశంలో మోదీ గాలి వీయడం రెడ్డి సామాజిక వర్గమంతా బీజేపీ వైపు మొగ్గు చూపడంతో ఆయన పార్టీలో చేరిపోయారు. పాలమూరు ఎంపీ సీటుకు టికెట్ సాధించినా ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన తన నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు తన కంటే వయసులో చిన్నవాడైన కిషన్‌రెడ్డి అదుపాజ్ఞల్లో ఉండాల్సి రావడం, ఆయన వర్గం నాగం వర్గాన్ని దూరంగా పెట్టడంతో కొంతకాలంగా ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. కనీసం నామినేటెడ్ పోస్టు అయినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పైగా తెలంగాణతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశంతో రాసుకుపూసుకు తిరగడంపై ప్రజలు, ఇతర పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సొంతకుంపటి పెడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి విఫలమై ఇప్పుడు మరోసారి కొత్త పార్టీ పెడితే ఎంత మేరకు సఫలీకృతమవుతారన్నది ఆసక్తి కరంగా మారింది.
Advertisement