ఎన్టీఆర్ నుంచి రాబోయే స్టిల్ అదేనా..?

ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి మరో స్టిల్ విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ తాజా స్టిల్ కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నయా స్టిల్ కు సంబంధించి ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. లండన్ లో జరుగుతున్న షూటింగ్ లో ఎన్టీఆర్ కోసం ఓ లేటెస్ట్ బైక్ ను కొనుగోలు చేశారు. హార్లీ డేవిడ్ సన్ కు చెందిన ఫ్యాట్ బాయ్ సిరీస్ బైక్ ను ఎన్టీఆర్ ఈ […]

Advertisement
Update:2015-08-13 00:30 IST
ఎన్టీఆర్ నుంచి రాబోయే స్టిల్ అదేనా..?
  • whatsapp icon
ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి మరో స్టిల్ విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఈ తాజా స్టిల్ కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నయా స్టిల్ కు సంబంధించి ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. లండన్ లో జరుగుతున్న షూటింగ్ లో ఎన్టీఆర్ కోసం ఓ లేటెస్ట్ బైక్ ను కొనుగోలు చేశారు. హార్లీ డేవిడ్ సన్ కు చెందిన ఫ్యాట్ బాయ్ సిరీస్ బైక్ ను ఎన్టీఆర్ ఈ సినిమాలో ఉపయోగిస్తున్నాడు. ఈ బైక్ ను ఎన్టీఆర్ నడుపుతున్న స్టిల్ నే ఆగస్ట్ 15 కానుకగా విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి సినిమా యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నిజానికి ఎన్టీఆర్ గెటప్ తో స్టిల్ ఇప్పుడు అభిమానులకు అవసరం లేదు. ఎందుకంటే సినిమాలో తారక్ గెటప్ ఎలా ఉంటుందో ఇప్పటికే అందరికీ తెలుసు. కాబట్టి గెటప్ ను దృష్టిలో పెట్టుకొని కాకుండా.. ఇంకాస్త ఫ్రెష్ గా ఉండే స్టిల్స్ ను విడుదల చేయాలని భావిస్తున్నాడు సుకుమార్. ఇందులో భాగంగా లేటెస్ట్ బైక్ పై తారక్ ఉన్న ఫొటోల్ని విడుదల చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం.
Tags:    
Advertisement

Similar News