బాహుబలి పై నాగ్ కి జలసీ ఎందుకు ?
బాహుబలి విడుదలకు ముందు సెలిబ్రిటీలు ఎలా ఆలోచించారో గానీ.. రిలీజ్ అయిన తరువాత కొందరు ఫీల్ అవుతున్నారు. ఇంత మంచి ఎపిక్ చిత్రంలో నటించి వుంటే బావుండేదని. ఆ మధ్య బాలీవుడ్ బాద్ షా అమితాబ్ ఏకంగా .. బాహుబలి లాంటి చిత్రంలో నటించ లేక పోవడం ఎంతో బాధగా ఉందని తెలిపిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మన సీనియర్ హీరో నాగార్జున తన మనసులో మాటను వెలిబుచ్చారు. క్రాస్ వర్డ్ బుక్ స్టోర్ లో […]
బాహుబలి విడుదలకు ముందు సెలిబ్రిటీలు ఎలా ఆలోచించారో గానీ.. రిలీజ్ అయిన తరువాత కొందరు ఫీల్ అవుతున్నారు. ఇంత మంచి ఎపిక్ చిత్రంలో నటించి వుంటే బావుండేదని. ఆ మధ్య బాలీవుడ్ బాద్ షా అమితాబ్ ఏకంగా .. బాహుబలి లాంటి చిత్రంలో నటించ లేక పోవడం ఎంతో బాధగా ఉందని తెలిపిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మన సీనియర్ హీరో నాగార్జున తన మనసులో మాటను వెలిబుచ్చారు. క్రాస్ వర్డ్ బుక్ స్టోర్ లో ప్రముఖ భారతీయ-ఆంగ్ల రచయిత ఆనంద్ నీలకంఠన్ భారతీయ పురాణాల ఆధారంగా రాసిన అజయ-2 రైజ్ ఆఫ్ కలిని సినీ నటులు అక్కినేని నాగార్జున అమల ఆవిష్కరించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ ..చిన్నప్పటి నుంచి తనకు మైథాలజీ ఇష్టమన్నాడు. బాహుబలి లో నటించలేక పోయినందుకు బాధగా ఉందన్నారు. ఆ నటులను చూసి జలసీగా ఫీలువుతున్నాని తన మనసలో మాటను వ్యక్త పరిచారు. సో సీనియార్టి పెరుగుతున్న కొద్ది నాగార్జున కు వైవిధ్యంగా చేయాలనే ఆలోచన మరింతగా డెవలప్ అవుతుంది అన్నమాట.