24 గంటల్లో చింతమనేనికి 2 ప్రమాదాలు!
అసెంబ్లీలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు రెండుసార్లు ఘోర ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దిబ్బగూడెంలో బుధవారం పోలవరం కుడికాల్వ పనులు పరిశీలిస్తుండగా అనూహ్యంగా కొబ్బరిచెట్టు విరిగి పడిన సంఘటనలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ పక్కనే ఉన్న ప్రభాకర్ గన్‌మెన్, పీఏలకు గాయాలయ్యాయి. నిజానికి చింతమనేని ప్రభాకర్ మంగళవారం కూడా ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి గన్నవరం బయలుదేరిన విమానానికి సాంకేతిక లోపం ఏర్పడి 40 నిమషాలు […]
Advertisement
అసెంబ్లీలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌కు రెండుసార్లు ఘోర ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దిబ్బగూడెంలో బుధవారం పోలవరం కుడికాల్వ పనులు పరిశీలిస్తుండగా అనూహ్యంగా కొబ్బరిచెట్టు విరిగి పడిన సంఘటనలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే ఆ పక్కనే ఉన్న ప్రభాకర్ గన్‌మెన్, పీఏలకు గాయాలయ్యాయి. నిజానికి చింతమనేని ప్రభాకర్ మంగళవారం కూడా ఓ ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ నుంచి గన్నవరం బయలుదేరిన విమానానికి సాంకేతిక లోపం ఏర్పడి 40 నిమషాలు గాల్లోనే చక్కెర్లు కొట్టింది. 119 మందితో బయలుదేరిన ఈ విమానంలో ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజుతోపాటు చింతమనేని కూడా ఉన్నారు. విమానం శంషాబాద్‌లో దిగిన తర్వాత కూడా 20 నిమషాలపాటు తలుపులు తెరుచుకోలేదు. దాంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. వీరిలో చింతమనేని కూడా ఒకరు.
Advertisement