బాబు.. కేంద్రంతో ఎందుకు లాలూచీ?
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రాఘవులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు కావాలనే మౌనం పాటిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని, కలిసి వస్తామంటున్న ప్రతిపక్షాలనొదిలి కేంద్రంతో ఎందుకు లాలూచీ పడుతున్నారని చంద్రబాబును ఆయన నిలదీశారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో రాఘవులు మాట్లాడారు. ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా […]
Advertisement
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన రాఘవులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు కావాలనే మౌనం పాటిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని, కలిసి వస్తామంటున్న ప్రతిపక్షాలనొదిలి కేంద్రంతో ఎందుకు లాలూచీ పడుతున్నారని చంద్రబాబును ఆయన నిలదీశారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో రాఘవులు మాట్లాడారు. ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా చంద్రబాబు తీసుకోవడానికి సిద్ధంగా లేరని అన్నారు. ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ప్రత్యేకహోదా తీసుకొస్తామంటే ఎవరూ కాదనరని, కానీ చంద్రబాబు అది కూడా ఎందుకు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సూటిగా అడిగి ఉంటే ఈపాటికి కేంద్రం తన నిర్ణయాన్ని సూటిగా చెప్పేదని ఆయన అన్నారు. అవేమీ చేయకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సరికాదన్నారు.రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసే సమయంలో అందరూ సహకరించాలని కోరిన విషయాన్ని గుర్తుచేస్తూ.. దాన్ని చట్టబద్ధమైన అంశంగా తీసుకోవాలని రాఘవులు అన్నారు. అప్పట్లో మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రత్యేకమని, ఆర్థికవనరులున్న హైదరాబాద్ విడిపోయిందని ఆయన గుర్తుచేశారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని నగరం లేదని అటువంటి సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వడం న్యాయసమ్మతమేనని బిజెపి నాయకులూ చెప్పారని గుర్తు చేశారు. హోదా ఇవ్వకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదనీ చెప్పారన్నారు. ఇప్పుడు అదే బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అవసరం లేదని అంటున్నారని, ఎందుకు అవసరం లేదో చెప్పాలని ఆయన అన్నారు. ఆనాడు ప్రకటన చేసిన బిజెపి నాయకులకు దీనిపై సరైన అవగాహన ఉండి మాట్లాడారా ? లేక మాట్లాడారా? అనే విషయాన్నీ స్పష్టం చేయాలని కోరారు. ఈ విషయంలో నిలదీయాల్సిన తెలుగుదేశం, వాగ్దానం నెరవేర్చాల్సిన బిజెపి రెండూ వెనక్కు పోతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీ అంటే నమ్మించడం తప్ప మరొకటి కాదని అన్నారు. విభజన సమయంలోనే రెవెన్యూలోటు పూడుస్తామని స్పష్టంగా పేర్కొన్నారని, ఇప్పుడు అన్నిటికీ కలిపి రూ.12 వేల కోట్లొస్తాయని చెబుతున్నారని, అయినా మూడువేల కోట్ల ఆర్థికలోటుందని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు కావాలంటున్నారని, నిపుణులతో కమిటీ వేసి ఎంత అవసరమో స్పష్టం చేయాలని అన్నారు. రాష్ట్రానికి మేలు చేస్తారనుకుని తెలుగుదేశం పార్టీని గెలిపించారని, అయినా సంవత్సర కాలంలోనే విశ్వాసాన్ని కోల్పోయిందని తెలిపారు.
Advertisement