అదే సక్సెస్ పాయింట్..
తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు. ఇతర హీరోల సినిమాలూ చూస్తారు కానీ.. మహేష్, పవన్ కళ్యాణ్ చిత్రాలకు ఈ ఫాలోయింగ్ ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్ వుంటే ఆ చిత్రం కచ్చితంగా హిట్ అయినట్లే . గతంలో మురారీ, అతడు, అర్జున్ చిత్రాలు ఈ విధంగా ఘన విజయాన్ని సాధించి పెట్టాయి. మహేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా రీచ్ చేశాయి. […]
Advertisement
తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు. ఇతర హీరోల సినిమాలూ చూస్తారు కానీ.. మహేష్, పవన్ కళ్యాణ్ చిత్రాలకు ఈ ఫాలోయింగ్ ఎక్కువ. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే ఎలిమెంట్స్ వుంటే ఆ చిత్రం కచ్చితంగా హిట్ అయినట్లే . గతంలో మురారీ, అతడు, అర్జున్ చిత్రాలు ఈ విధంగా ఘన విజయాన్ని సాధించి పెట్టాయి. మహేష్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా రీచ్ చేశాయి.
ఇక పవర్ స్టార్ అత్తారింటికి దారేది చిత్రం పూర్తిగా ఫ్యామిలీ చిత్రం. త్రివిక్రమ్ ఎంచుకున్న కథ, కథనాలు.. పవర్ స్టార్ సినిమా చేయడంతో బాక్సఫీస్ కలెక్షన్ల పరంగా షేక్ అయ్యింది. బాహుబలికి ముందు పవర్ స్టార్ అత్తారింటికి దారేది చిత్రం ఆల్ టైమ్ రికార్డ్ ను క్రియోట్ చేసింది. అదే తరహాలో శ్రీమంతుడు చిత్రం ఉంది. మొదటి రోజు కలెక్షన్లు ఇంటా , బయట( తెలుగులో విడుదలైన అన్నిచోట్ల ) కలిపి దాదాపు 20 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ ఎనలిస్ట్ ల టాక్. సినిమాకు సర్వత్ర పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కాబట్టి .. అత్తారింటికి దారేది సినిమా వసూలు చేసిన 90 కోట్లు రికార్డ్ ను ఈ చిత్రం ఓవర్ టేక్ చేసే అవకాశం ఎక్కువుగా ఉందనడంలో సందేహమే లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా చేయడమే సినిమా సక్సెస్ పాయింట్. ఫ్యామిలీలు థియేటర్స్ కు కదిలితే బొమ్మ హిట్ కాకుండ ఉంటుందా..!
Advertisement