వరంగల్ బరిలో సర్వే !
కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్ పార్లమెంటు స్థానానికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే! కానీ, ఈ స్థానంపై పోటీకి కాంగ్రెస్ నుంచి పెద్దలెవరూ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే 2014 ఎన్నికల కోసం తాము చేసిన అప్పులు తీరలేదని, ఇప్పటికిప్పుడు పోటీ అంటే కష్టమేనని హేమాహేమీలు చేతులెత్తేస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహాల పేర్లు పరిశీలనకు వచ్చినా ఆర్థిక కారణాల దృష్ట్యా వెనకడుగు వేసినట్లు సమాచారం. పార్లమెంటు మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరు […]
Advertisement
కడియం శ్రీహరి రాజీనామాతో వరంగల్ పార్లమెంటు స్థానానికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే! కానీ, ఈ స్థానంపై పోటీకి కాంగ్రెస్ నుంచి పెద్దలెవరూ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే 2014 ఎన్నికల కోసం తాము చేసిన అప్పులు తీరలేదని, ఇప్పటికిప్పుడు పోటీ అంటే కష్టమేనని హేమాహేమీలు చేతులెత్తేస్తున్నారు. మాజీ ఎంపీ వివేక్, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహాల పేర్లు పరిశీలనకు వచ్చినా ఆర్థిక కారణాల దృష్ట్యా వెనకడుగు వేసినట్లు సమాచారం. పార్లమెంటు మాజీ స్పీకర్ మీరాకుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈమె పేరును రాష్ట్ర పీసీసీ కూడా సమర్థిస్తున్నట్లు తెలిసింది. మీరాకుమార్ అయితే నిధులకు కేంద్రపార్టీ నిధులు కూడా కలిసి వస్తాయని అనుకోవడమే ఇందుకు కారణమట. తాజాగా వరంగల్ స్థానానికి సర్వే సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన పోటీ చేస్తారా? చేయరా? అన్నది అధికారికంగా ఖరారు కావాల్సింది. తాజాగా ఆయన వరంగల్‌లో పర్యటించడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. శనివారం ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రజాసమస్యలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సర్వే మండిపడ్డారు. కేసీఆర్ ఎన్టీఆర్ కంటే గొప్పవాడేం కాదని పేర్కొన్నారు. ప్రజాసమస్యలు తీర్చకుంటే ప్రజలు ఎన్టీఆర్‌నే గద్దె దింపారని, కేసీఆర్ వారికి ఒక లెక్క కాదని చెప్పారు. పనిలో పనిగా కడియం శ్రీహరిపైనా ఆరోపణలు చేశారు. కడియం తన కులాన్ని నిరూపించుకోవాలని సవాలు విసిరారు.
Advertisement