ఖమ్మం వెళ్లేందుకు సండ్రకు అనుమతి!
ఓటుకు నోటు కుంభకోణం కేసులో 5వ నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర ఖమ్మం వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో కోర్టు ఆయనకు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సండ్ర బెయిల్ కోసం పూచీకత్తు సమర్పించిన గోపాల క్రిష్ణ 24న మరణించాడు. బెయిల్ షరతుల ప్రకారం నగరం విడిచి వెళ్లేందుకు సండ్రకు అనమతుల్లేవు. దీంతో కోర్టును ఆశ్రయించాడు. గోపాలక్రిష్ణ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని వేడుకున్నాడు. కోర్టు ఈ మేరకు అనుమతులు జారీ […]
Advertisement
ఓటుకు నోటు కుంభకోణం కేసులో 5వ నిందితుడు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర ఖమ్మం వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో కోర్టు ఆయనకు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. సండ్ర బెయిల్ కోసం పూచీకత్తు సమర్పించిన గోపాల క్రిష్ణ 24న మరణించాడు. బెయిల్ షరతుల ప్రకారం నగరం విడిచి వెళ్లేందుకు సండ్రకు అనమతుల్లేవు. దీంతో కోర్టును ఆశ్రయించాడు. గోపాలక్రిష్ణ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని వేడుకున్నాడు. కోర్టు ఈ మేరకు అనుమతులు జారీ చేసింది. దీంతో ఖమ్మం వెళ్లేందుకు సండ్రకు మార్గం సుమగమమైంది. మరోవైపు ఈ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను విడుదల చేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు ఈనెల 14కు వాయిదా వేసింది.
Advertisement