అక్కినేని హీరోలతో  ఇల్లి బేబి రొమాన్స్ అట..

సెల్ఫీలు దిగడానికి అందరూ ఇష్టపడతారు. ఇలాంటి వాళ్ల కోసం సెల్ఫీ స్టిక్స్ కూడా వచ్చాయి. కానీ ఇలియానా మాత్రం ఈ విష.యంలో కంట్రోల్ తప్పింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చింది. కనీసం రోజుకు ఓ 10 సెల్ఫీలైనా దిగందే తనకు నిద్రపట్టదంటోంది ఇలియానా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదే ఒక యాంగిల్ లో, ఏదో ఒక గెటప్ తో సెల్ఫీలు దిగుతుంటానని ప్రకటించింది. ముఖంపై మేకప్ ఉందా లేదా అనే విషయంతో […]

Advertisement
Update:2015-08-06 00:34 IST
సెల్ఫీలు దిగడానికి అందరూ ఇష్టపడతారు. ఇలాంటి వాళ్ల కోసం సెల్ఫీ స్టిక్స్ కూడా వచ్చాయి. కానీ ఇలియానా మాత్రం ఈ విష.యంలో కంట్రోల్ తప్పింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకొచ్చింది. కనీసం రోజుకు ఓ 10 సెల్ఫీలైనా దిగందే తనకు నిద్రపట్టదంటోంది ఇలియానా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదే ఒక యాంగిల్ లో, ఏదో ఒక గెటప్ తో సెల్ఫీలు దిగుతుంటానని ప్రకటించింది. ముఖంపై మేకప్ ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా సెల్ఫీలు తీసుకోవడం తన హాబీ అని ప్రకటించింది. ఇప్పటికే అలాంటి సెల్ఫీలతో తన ఫోన్ మొత్తం నిండిపోయిందని చెబుతోంది ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాల్లేక ఖాళీగా ఉన్న ఇలియానా, త్వరలోనే మళ్లీ సౌత్ సినిమాల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది. దీనికి సంబంధించి అక్కినేని కాంపౌండ్ తో చర్చలు కూడా జరుపుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ లేదా నాగచైతన్య సినిమాలో ఇలియానా కనిపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పటివరకు ఇలా సెల్ఫీలతోనే కాలక్షేపం చేస్తుంది ఇలియానా.
Tags:    
Advertisement

Similar News