కండలవీరుడి కన్నీటి ఖరీదు రూ.500 కోట్లు.!
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అంటే ఒక హీమ్యాన్. ఆయన చిత్రాలంటే సరదా ఫైట్స్.. మంచి మ్యూజిక్… సరదా స్టెప్స్..అదిరిపోయే యాక్షన్ వుంటాయి. కండల వీరుడు కత్తి పడితే చూస్తారు. కసరత్తులు చేసినా చూస్తారు. కొండల్ని పిండి చేస్తే చప్పట్లు కొడతారు కానీ..కన్నీరు కారిస్తే చూస్తారా? ఈ అనుమానాలు బజరంగీ భాయ్‌జాన్ దర్శకుడు కబీర్ ఖాన్ మాత్రం రాలేదు. కండలవీరుడిని ఈ సినిమాలో కన్నీరింకి పోయేలా దర్శకుడు ఏడిపించాడు. ఆ కన్నీరే కాసుల వర్షం కురిపించింది. సల్మాన్‌ఖాన్ […]
Advertisement
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అంటే ఒక హీమ్యాన్. ఆయన చిత్రాలంటే సరదా ఫైట్స్.. మంచి మ్యూజిక్… సరదా స్టెప్స్..అదిరిపోయే యాక్షన్ వుంటాయి. కండల వీరుడు కత్తి పడితే చూస్తారు. కసరత్తులు చేసినా చూస్తారు. కొండల్ని పిండి చేస్తే చప్పట్లు కొడతారు కానీ..కన్నీరు కారిస్తే చూస్తారా? ఈ అనుమానాలు బజరంగీ భాయ్‌జాన్ దర్శకుడు కబీర్ ఖాన్ మాత్రం రాలేదు. కండలవీరుడిని ఈ సినిమాలో కన్నీరింకి పోయేలా దర్శకుడు ఏడిపించాడు. ఆ కన్నీరే కాసుల వర్షం కురిపించింది. సల్మాన్‌ఖాన్ కన్నీటికి ఖరీదు కట్టిన ప్రేక్షక షరాబులు దాని లెక్క 500 కోట్ల రూపాయల పైమాటేనని తేల్చేశారు. భజరంగీ బాయిజాన్ లాంటి చిత్రం సల్మాన్ ఖాన్ చేస్తే అభిమానుల గుండెల్లోకి చొచ్చుకుపోతుందని దర్శకుడు ముందే ఊహించాడు. ఆ ఊహే నిజమైంది. మానవత్వానికి..నిజాయితీకి.. ప్రేమకు .. ఏ అడ్డుగోడలుండవనే క్యారెక్టర్ లో సల్మాన్ ఒదిగిపోయాడు. నటించలేదు. జీవించేశాడు. అసలు సల్మాన్ ఖాన్ లో ఇంతటి నటుడు వున్నాడా అనిపిస్తుంది. ఆర్థ్రతతో కూడిన సన్నివేశాల్లో సల్మాన్ ఏడవడంకాదు. చూస్తున్న ప్రేక్షకుల కళ్ల నుంచీ అప్రయత్నంగా కన్నీళ్లొస్తాయి. అందుకే భజరంగీ భాయిజాన్ ఇండియాలో రూ.300 కోట్లు, ఓవర్సీస్ లో రూ.200 కోట్లు వసూలు చేసింది. మరో వంద కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఓవరాల్‌గా కండలవీరుడు సల్మాన్ కన్నీటి ఖరీదు ఐదు వందల కోట్ల రూపాయలు దాటేసింది.
Advertisement