రిషితేశ్వరి మృతిపై గవర్నర్‌ను కలుస్తాం: వైసీపీ
రిషితేశ్వరి మృతి కేసులో విచారణ సరిగా జరగడం లేదని వైసీపీ నాయకుడు పార్థసారథి విమర్శించారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. యూనివర్సిటీలో అధ్యాపకులు విద్యను గాలికొదిలి రాజకీయ నాయకుల భజన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రిషితేశ్వరి మృతిపై గవర్నర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో పార్థసారథితో పాటు వైసీపీ నేతలు వంగవీటిరాధ, అప్పిరెడ్డి, మేరుగ […]
Advertisement
రిషితేశ్వరి మృతి కేసులో విచారణ సరిగా జరగడం లేదని వైసీపీ నాయకుడు పార్థసారథి విమర్శించారు. ఈ కేసులో రాజకీయ ఒత్తిళ్లు పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. యూనివర్సిటీలో అధ్యాపకులు విద్యను గాలికొదిలి రాజకీయ నాయకుల భజన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రిషితేశ్వరి మృతిపై గవర్నర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితోగానీ, సీబీఐతోగానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్‌మీట్‌లో పార్థసారథితో పాటు వైసీపీ నేతలు వంగవీటిరాధ, అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున వర్శిటీ వద్ద నిజనిర్ధారణ కమిటీ నిరసన
రిషితేశ్వరి కేసులో నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విచారణకు తమను కూడా అనుమతించాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ చేసిన డిమాండును అధికారులు తిరస్కరించారు. తమను వర్శిటీలోకి కూడా వెళ్ళనీయకుండా గేట్లు మూసి వేయడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఈ సందర్భంగా వారు వైస్ ఛాన్సలర్ సాంబశివరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. గేటు వద్దే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తమను, మీడియాను కూడా యూనివర్శిటీ లోపలికి అనుమతించాలని డిమాండు చేస్తూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement