మళ్ళీ రోడ్డెక్కిన అగ్రిగోల్డ్ బాధితులు
రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న అగ్రిగోల్డ్ బాధితులు మళ్ళీ రోడ్డెక్కారు. సోమవారం నెల్లూరు వద్ద జాతీయ రహదారిని అగ్రిగోల్డ్ బాధితులు దిగ్బంధించారు. దీంతో కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వం మిలాఖత్ అయ్యిందని కాంగ్రెస్ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు కూడా యాజమాన్యానికి మద్దతు ఇస్తూ బాధితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇందులో కొంతమంది టీడీపీ నాయకులకు […]
Advertisement
రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న అగ్రిగోల్డ్ బాధితులు మళ్ళీ రోడ్డెక్కారు. సోమవారం నెల్లూరు వద్ద జాతీయ రహదారిని అగ్రిగోల్డ్ బాధితులు దిగ్బంధించారు. దీంతో కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ నిలిచిపోయింది. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు తెలిపారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వం మిలాఖత్ అయ్యిందని కాంగ్రెస్ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు మంత్రులు కూడా యాజమాన్యానికి మద్దతు ఇస్తూ బాధితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇందులో కొంతమంది టీడీపీ నాయకులకు కూడా హస్తం ఉందని ఆయన అన్నారు. వీరంతా కలిసి ఆర్ధిక మాఫీయాగా ఏర్పడ్డారని చెబుతూ బాధితుల సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, అనిల్‌కుమార్, సీపీఐ నేతలు కూడా వారికి సంఘీభావం తెలిపారు.
Advertisement