పోలీస్ అయితే ఏంటీ..ఆమే సల్మాన్ సోదరి మరి...!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు ప్రేమైన, కోపమైన ఎక్కువే. ఆయన ప్రేమ ను తట్టుకోవడం మరి కష్టం అంటుంటారు. ఇక సోదరి ఆర్పిత ఖాన్ అంటే సల్మాన్ ఖాన్ ప్రాణం అన్నట్లు గా ఉంటారు. ఆమే పెళ్లి అంగ రంగ వైభవంగా ఈ మధ్యే జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 1 న ఆర్పిత ఖాన్ పుట్టినరోజు. బాలీవుడ్ లోని క్లోజ్ ఫ్రెండ్స్ ను బర్త్ డే పార్టీకి ఆహ్వానించారట. ఇంత వరకు […]
Advertisement
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు ప్రేమైన, కోపమైన ఎక్కువే. ఆయన ప్రేమ ను తట్టుకోవడం మరి కష్టం అంటుంటారు. ఇక సోదరి ఆర్పిత ఖాన్ అంటే సల్మాన్ ఖాన్ ప్రాణం అన్నట్లు గా ఉంటారు. ఆమే పెళ్లి అంగ రంగ వైభవంగా ఈ మధ్యే జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 1 న ఆర్పిత ఖాన్ పుట్టినరోజు. బాలీవుడ్ లోని క్లోజ్ ఫ్రెండ్స్ ను బర్త్ డే పార్టీకి ఆహ్వానించారట. ఇంత వరకు బాగానే ఉంది. కేకు కట్ చేసుకున్నారు. బర్త్ డే విషెష్ అర్పితాకు తెలిపారు. ఇక్కడితో అయిపోలేదండోయ్.
అసలు రభస నైట్ టైమ్ లో స్టార్ట్ అయ్యింది. రాత్రింత లౌడ్ మ్యూజిక్ పెట్టి దుమ్ము లేపాశారట. అది ఎక్కడో రిసార్ట్ లో అయితే నో ప్రాబ్లమ్. రెసిడెన్షియల్ ఏరియాస్ లో ఫుల్ సౌండ్ పెట్టి రచ్చ చేస్తే బావుండదు కదా. అందుకే ఆ గోలను భరించ లేని వారు వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం ..పోలీసులు రావడం… సల్మాన్ ఖాన్ కి సర్ధి చెప్పి వెళ్ళిపోయారట. ఎంత స్టార్ సెలిబ్రెటి సోదరి అయితే మాత్రం.. అలా కామన్ సెన్స్ లేకుండా చేయడం తప్పు కదా అంటున్నారు పరిశీలకులు.
Advertisement