ఆమెకు సీటడిగతే ఈయన సీటు పోయింది!

ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ భార్యకు రాజ్యసభ సీటిస్తే ఆ వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని సిఫార్సు చేసిన సమాజ్‌వాది పార్టీ మహారాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు తన పదవికే ఎసరు తెచ్చుకున్నాడు. ఉరి శిక్షకు గురైనందున అతని భార్య నిస్సహారాలైందని, ఆమెకు రాజ్యసభ సీటిచ్చి రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరిన సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ ఫారూఖ్ ఘోసీని సమాజ్‌వాదీ పార్టీ సస్పెండ్ చేసింది. తనను సస్పెండ్ చేసినా తన డిమాండ్ నుంచి వెనక్కు […]

Advertisement
Update:2015-08-01 11:43 IST
ముంబై వరుస పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ భార్యకు రాజ్యసభ సీటిస్తే ఆ వర్గం ఓట్లన్నీ తమకే వస్తాయని సిఫార్సు చేసిన సమాజ్‌వాది పార్టీ మహారాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు తన పదవికే ఎసరు తెచ్చుకున్నాడు. ఉరి శిక్షకు గురైనందున అతని భార్య నిస్సహారాలైందని, ఆమెకు రాజ్యసభ సీటిచ్చి రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరిన సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు మహ్మద్ ఫారూఖ్ ఘోసీని సమాజ్‌వాదీ పార్టీ సస్పెండ్ చేసింది. తనను సస్పెండ్ చేసినా తన డిమాండ్ నుంచి వెనక్కు తగ్గబోనని ఘోసీ స్పష్టం చేశారు. యాకుబ్ మరణంతో ఆయన భార్య రహీన్ నిస్సహాయస్థితిలో పడిపోయారని, రాజ్యసభ సీటిచ్చి ఆమెను ఆదుకోవాలని ఘోసీ సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంకు లేఖ రాయడం కలకలం రేపింది. ఆయన అక్కడితో ఆగకుండా గతంలో బందిపోటు దొంగ పూలన్‌దేవికి కూడా పార్టీలో స్థానం ఇచ్చామని, అలాగే ఈమెని కూడా సమాజ్‌వాది పార్టీలోకి ఆహ్వానించాలని ఆయన సూచించారు. సాధారణంగా ముస్లింలకు పెద్దపీట వేస్తుందనే పేరున్న సమాజ్‌వాదీ కూడా ఘోసీ ప్రతిపాదనపై కన్నెర్ర చేయడానికి కారణం లేకపోలేదు. ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ములాయం వెనుకడుగు వేయక తప్పలేదు. 257 మంది మృతికి, 650 మందికి పైగా గాయపడడానికి కారకుడైన ముంబై పేలుళ్ల దోషి మెమన్‌ భార్యకు రాజ్యసభ సీటిమ్మని అడగడంపై దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆగ్రహజ్వాలలు రేగాయి. దీంతో ఘోసీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
Tags:    
Advertisement

Similar News