బాహుబలి రికార్డ్ క్రాస్ చేసే పనిలో శంకర్, షారుక్ ?

దర్శకుడు శంకర్ ప్రస్తుతం లండన్ లో తిష్ట వేశాడు. రోబో-2 స్క్రిప్ట్ వర్క్ పని మీద పూర్తిగా దృష్టిపెట్టాడు. పైనిలోపనిగా రోబో-2 గ్రాఫిక్స్ కు సంబంధించి లండన్ లోని టాప్ టెక్నీషియన్లతో చర్చలు కూడా జరుపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం రోబో-2 సినిమాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే శంకర్ లండన్ వెళ్లాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి రజనీకాంత్ ప్రాధమికంగా ఒప్పుకున్నాడని, పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే రాసుకొని రమ్మన్నాడని తెలుస్తోంది. ఆస్కార్ రవిచంద్రన్ రోబో-2ను […]

Advertisement
Update:2015-07-31 00:30 IST

దర్శకుడు శంకర్ ప్రస్తుతం లండన్ లో తిష్ట వేశాడు. రోబో-2 స్క్రిప్ట్ వర్క్ పని మీద పూర్తిగా దృష్టిపెట్టాడు. పైనిలోపనిగా రోబో-2 గ్రాఫిక్స్ కు సంబంధించి లండన్ లోని టాప్ టెక్నీషియన్లతో చర్చలు కూడా జరుపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం రోబో-2 సినిమాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే శంకర్ లండన్ వెళ్లాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి రజనీకాంత్ ప్రాధమికంగా ఒప్పుకున్నాడని, పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే రాసుకొని రమ్మన్నాడని తెలుస్తోంది. ఆస్కార్ రవిచంద్రన్ రోబో-2ను నిర్మిస్తారని తెలుస్తోంది. రజనీ ప్రాధమికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఆస్కార్ రవిచంద్రనే దగ్గరుండి తన సొంత ఖర్చులతో శంకర్ ను లండన్ పంపించాడు. ఎన్ని రోజులైనా అక్కడుండి పని పూర్తిచేసుకోమని రమ్మన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రతి విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని అంతా ఫిక్స్ అయ్యారు. అతి అంచనాలతోనే ఐ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని, కాబట్టి రోబో-2పై అనవసరంగా అంచనాలు పెంచొద్దని రజనీకాంత్ శంకర్ కు సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదే సినిమాలో విలన్ గా నటించేందుకు విక్రమ్ కూడా ఒప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అటు రోబో-2 హిందీ వెర్షన్ లో విలన్ గా నటించడానికి షారూక్ కూడా ఒప్పుకున్నట్టు సమాచారం.

Tags:    
Advertisement

Similar News