బిడ్డకు తల్లిగా నటిస్తున్న నయన్
తన వయసుకంటే కాస్త పెద్ద పాత్రను నయనతార పోషిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడా పాత్రకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ డీటెయిల్స్ బయటకొచ్చాయి. తాజా చిత్రంలో నయనతార ఓ బిడ్డకు తల్లిగా నటిస్తోంది. తమిళ్ లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది నయనతార. ఈ సినిమాలో ఆరేళ్ల పాపకు తల్లిగా నటిస్తోంది నయనతార. హారర్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కథ మొత్తం నయనతార చుట్టూనే తిరుగుతుంది. స్టోరీలైన్ బాగా నచ్చడంతో కాస్త రెమ్యునరేషన్ […]
Advertisement
తన వయసుకంటే కాస్త పెద్ద పాత్రను నయనతార పోషిస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడా పాత్రకు సంబంధించిన ఎక్స్ క్లూజివ్ డీటెయిల్స్ బయటకొచ్చాయి. తాజా చిత్రంలో నయనతార ఓ బిడ్డకు తల్లిగా నటిస్తోంది. తమిళ్ లో అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది నయనతార. ఈ సినిమాలో ఆరేళ్ల పాపకు తల్లిగా నటిస్తోంది నయనతార. హారర్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. కథ మొత్తం నయనతార చుట్టూనే తిరుగుతుంది. స్టోరీలైన్ బాగా నచ్చడంతో కాస్త రెమ్యునరేషన్ తగ్గించుకొని మరీ ఈ సినిమాలో నటిస్తోంది నయనతార. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. తమిళ్ లో మాయ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో మయూరి పేరుతో విడుదల చేయాలని నిర్ణయించారు. గతంలో తెలుగులో నయనతార శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అనామిక సినిమాలో నటించింది. దాదాపు అదే ఛాయల్లో మయూరి సినిమా కూడా ఉంటుందని సమాచారం. అయితే కంప్లీట్ హారర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ నడుస్తోంది.
Advertisement