హాలీవుడ్ బరిలో బాహుబలి

బాహుబలి సినిమా ఇప్పటికే ఇండియాలో సంచలనం సృష్టించింది. అటు ఓవర్సీస్ లో కూడా దుమ్ముదులిపింది. సరికొత్త లెక్కలు సృష్టించింది. ఈ ఉత్సాహంతో మేకర్స్ మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. సినిమాను ఇప్పుడు మరో రెండు భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలైంది. ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లిష్, చైనీస్ భాషల్లో కూడా బాహుబలిని విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీనికి […]

Advertisement
Update:2015-07-31 00:31 IST
బాహుబలి సినిమా ఇప్పటికే ఇండియాలో సంచలనం సృష్టించింది. అటు ఓవర్సీస్ లో కూడా దుమ్ముదులిపింది. సరికొత్త లెక్కలు సృష్టించింది. ఈ ఉత్సాహంతో మేకర్స్ మరో డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. సినిమాను ఇప్పుడు మరో రెండు భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలైంది. ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లిష్, చైనీస్ భాషల్లో కూడా బాహుబలిని విడుదల చేయాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి హాలీవుడ్ ఎడిటింగ్ నిపుణుడు విన్సెంట్ టబైళన్ ను తీసుకున్నారు. హాలీవుడ్ లో ది ఇన్ క్రెడిబుల్ హల్క్, క్లాష్ ఆఫ్ ది టైటాన్స్, టేకెన్-2, ది లెజెండ్ ఆఫ్ హెర్కులస్ లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు విన్సెంట్. ఇప్పుడు బాహుబలి టోటల్ రష్ ను విన్సెంట్ చేతిలో పెట్టాలనుకుంటున్నారు. హాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు పాటలు లేకుండా.. గంటన్నరలో సినిమాను రసరమ్యంగా కట్ చేసే బాధ్యతను విన్సెంట్ కు అప్పగించారు. హాలీవుడ్ వెర్షన్ పూర్తయిన తర్వాత ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్స్ కు కూడా బాహుబలి చిత్రాన్ని పంపించాలని అనుకుంటున్నాడు దర్శకుడు రాజమౌళి.
Tags:    
Advertisement

Similar News