మరాఠీ హీరోయిన్‌ రూపాలీపై యాసిడ్‌ దాడి!

యాసిడ్‌ దాడులు సామాన్యుల దగ్గర నుంచి చిత్ర పరిశ్రమకూ తాకాయి. తాను చెప్పినట్టు చేయలేదన్న కోపంతో హీరోయిన్‌పై ఓ దర్శకుడు యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని నారాయణపూర్‌ గ్రామంలో జరిగింది. నటి రూపాలి (20), హీరో వికాస్‌ (19) కలిసి ఓ భోజ్‌పురి చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరూ షూటింగ్ జరుపుకుంటున్న ప్రాంతానికి ఈ దర్శకుడు అజయ్‌ వచ్చాడు. విరామ సమయంలో ఓ కాలేజీ ప్రాంగణంలో కూర్చుని హీరోహీరోయిన్‌లు  మాట్లాడుకుంటున్న సమయంలో ఈ ఇద్దరిపై అజయ్‌ […]

Advertisement
Update:2015-07-29 05:30 IST
యాసిడ్‌ దాడులు సామాన్యుల దగ్గర నుంచి చిత్ర పరిశ్రమకూ తాకాయి. తాను చెప్పినట్టు చేయలేదన్న కోపంతో హీరోయిన్‌పై ఓ దర్శకుడు యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని నారాయణపూర్‌ గ్రామంలో జరిగింది. నటి రూపాలి (20), హీరో వికాస్‌ (19) కలిసి ఓ భోజ్‌పురి చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరూ షూటింగ్ జరుపుకుంటున్న ప్రాంతానికి ఈ దర్శకుడు అజయ్‌ వచ్చాడు. విరామ సమయంలో ఓ కాలేజీ ప్రాంగణంలో కూర్చుని హీరోహీరోయిన్‌లు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ ఇద్దరిపై అజయ్‌ యాసిడ్‌ పోసి పారిపోయాడు. తాను వద్దన్నా వినకుండా వికాస్‌తో కలిసి నటించడమే దర్శకుడు అజయ్‌ కోపానికి కారణమని తెలుస్తోంది. ఈ దాడి వెనుక దాగిన మరో కోణం రూపాలిని అజయ్‌ ప్రేమించడమే అని తెలుస్తోంది. తన ప్రియురాలు చెప్పిన మాట వినకుండా హీరో వికాస్‌తో నటించడం అతనికి నచ్చలేదు. దాంతో యాసిడ్‌తో దాడి చేశాడని చెబుతున్నారు. దాడి జరిగిన ఇద్దరినీ ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్రకు చెందిన హీరోయిన్‌ రూపాలీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్శకుడు అజయ్‌ కోసం గాలిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News