క్షమాపణలు చెప్పిన సల్మాన్

ముంబయి బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమెన్ కు ఉరిశిక్ష అమలుపై సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లు పెద్ద వివాదానికి దారితీశాయి. దీంతో సల్మాన్ వెంటనే తప్పుదిద్దుకున్నాడు. తన ట్వీట్స్ ను తప్పుగా అర్థంచేసుకున్నారని మరోసారి ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. తను ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు, మత స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఎవరి మనసైనా నొప్పించి ఉంటే బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నానని రాసుకొచ్చాడు. మొన్నటికి మొన్న యూకూబ్ ను అమాయకుడిగా పోల్చిన సల్మాన్, రాత్రికిరాత్రి […]

Advertisement
Update:2015-07-27 00:40 IST
ముంబయి బాంబు పేలుళ్ల నిందితుడు యాకుబ్ మెమెన్ కు ఉరిశిక్ష అమలుపై సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్లు పెద్ద వివాదానికి దారితీశాయి. దీంతో సల్మాన్ వెంటనే తప్పుదిద్దుకున్నాడు. తన ట్వీట్స్ ను తప్పుగా అర్థంచేసుకున్నారని మరోసారి ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. తను ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు, మత స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేయలేదని, ఒకవేళ ఎవరి మనసైనా నొప్పించి ఉంటే బహిరంగంగా క్షమాపణలు కోరుతున్నానని రాసుకొచ్చాడు. మొన్నటికి మొన్న యూకూబ్ ను అమాయకుడిగా పోల్చిన సల్మాన్, రాత్రికిరాత్రి మాట మార్చాడు. యాకూబ్ ను కచ్చితంగా ఉరి తీయాల్సిందేనంటూ ట్వీట్ చేశాడు. తనకు చట్టంపై, సర్వోన్నత న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందని రాసుకొచ్చాడు. నిజానికి ఎవర్నీ కించపరిచే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నాడు సల్మాన్. తన తండ్రి తనకు ఫోన్ చేసి ఆ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వస్తున్నాయని చెప్పేవరకు తనకు విషయం తెలియదని రాసుకొచ్చాడు. ఇప్పటికైనా తన వ్యాఖ్యల్ని పెద్దమనసుతో మన్నించాలని రాసుకొచ్చాడు. అంతకుముందు ట్వీట్స్ తో యాకూబ్ మెమెన్ ను పులిగా అభివర్ణించాడు సల్మాన్.
Tags:    
Advertisement

Similar News