ద్విభాషా చిత్రంగా బ్రహ్మోత్సవం
ఇప్పటివరకు మహేష్ నటించిన సినిమాలన్నీ స్ట్రయిట్ తెలుగు మూవీసే. కావాలంటే వాటిని డబ్ చేసి మిగతా భాషల్లో విడుదలచేసే వారు నిర్మాతలు. తాజా చిత్రం శ్రీమంతుడు కూడా అదే తరహాలో విడుదలవుతోంది. తెలుగులో తెరకెక్కి తమిళ్ లో సెల్వంధన్ పేరుతో డబ్ అయింది. కానీ కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ తమిళ్ లో కూడా నేరుగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. తన కొత్త సినిమా బ్రహ్మోత్సవాన్ని తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరక్కించాలని నిర్ణయించాడు. ఈమేరకు […]
Advertisement
ఇప్పటివరకు మహేష్ నటించిన సినిమాలన్నీ స్ట్రయిట్ తెలుగు మూవీసే. కావాలంటే వాటిని డబ్ చేసి మిగతా భాషల్లో విడుదలచేసే వారు నిర్మాతలు. తాజా చిత్రం శ్రీమంతుడు కూడా అదే తరహాలో విడుదలవుతోంది. తెలుగులో తెరకెక్కి తమిళ్ లో సెల్వంధన్ పేరుతో డబ్ అయింది. కానీ కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ తమిళ్ లో కూడా నేరుగా సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. తన కొత్త సినిమా బ్రహ్మోత్సవాన్ని తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరక్కించాలని నిర్ణయించాడు. ఈమేరకు నిర్మాతలతో చర్చలు జరిపిన మహేష్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలకు సమాచారం అందించాడు. సో.. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి రాబోతున్న బ్రహ్మోేత్సవం సినిమా ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో తెరెకెక్కుతుంది. మహేష్ కు తమిళనాట కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అతడు నటించిన వన్-నేనొక్కడినే సినిమా తెలుగులో పెద్దగా ఆడకపోయినప్పటికీ.. తమిళనాట మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు.. మహేష్ నటించిన ప్రతి సినిమానూ కొద్దోగొప్పో తమిళ ప్రేక్షకులు కూడా చూస్తుంటారు. అందుకే ఈసారి నేరుగా తమిళ్ లోనే బ్రహ్మోత్సవం సినిమాచేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణీత, కాజల్ హీరోయిన్లు.
Advertisement