కోలీవుడ్ కు ఆదర్శంగా నిలిచిన రాజమౌళి
బాహుబలి సినిమా తర్వాత ఎంతోమంది ప్రముఖులకు ఆదర్శంగా నిలిచాడు రాజమౌళి. మరీ ముఖ్యంగా కోలీవుడ్ దర్శకుల్ని మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే శంకర్ లాంటి బిగ్ డైరక్టర్ రాజమౌళిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మరోవైపు మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడు కూడా రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు. వీళ్లతో పాటు గౌతమ్ మీనన్, శివ లాంటి ఎంతోమంది తమిళ దర్శకులు రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఎస్పీ జననాధన్ అనే దర్శకుడు కూడా చేరిపోయాడు. తమిళనాట ప్రయోగాత్మక చిత్రాలు తీయడంలో […]
Advertisement
బాహుబలి సినిమా తర్వాత ఎంతోమంది ప్రముఖులకు ఆదర్శంగా నిలిచాడు రాజమౌళి. మరీ ముఖ్యంగా కోలీవుడ్ దర్శకుల్ని మెస్మరైజ్ చేశాడు. ఇప్పటికే శంకర్ లాంటి బిగ్ డైరక్టర్ రాజమౌళిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మరోవైపు మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడు కూడా రాజమౌళిని ఆకాశానికెత్తేశాడు. వీళ్లతో పాటు గౌతమ్ మీనన్, శివ లాంటి ఎంతోమంది తమిళ దర్శకులు రాజమౌళి పనితనాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఎస్పీ జననాధన్ అనే దర్శకుడు కూడా చేరిపోయాడు. తమిళనాట ప్రయోగాత్మక చిత్రాలు తీయడంలో పేరుతెచ్చుకున్నారు జననాధన్. ఇతను తీసిన పారమ్ పొక్కు అనే తమిళ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడీ దర్శకుడు బాహుబలి స్ఫూర్తితో తను కూడా ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు. యుద్ధాల నేపథ్యంలో బాహుబలి సినిమా వస్తే.. ప్రేమ కథాంశంతో మరో చారిత్రక సినిమా తీస్తానని ప్రకటించాడు జననాథన్. 9వ శతాబ్దానికి చెందిన కథతో సినిమా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. భవిష్యత్తులో ఇంకెంతమంది దర్శకుల్ని ఈ సినిమా ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.
Advertisement