లేడీ అమితాబ్ Vs మెగాస్టార్ చిరు

రాజకీయాలలోకి వచ్చి చిరంజీవి తప్పు చేసాడనే భావన చాలా మందిలో ఉండొచ్చు కానీ.. సినిమాల విషయానికి వస్తే మాత్రం…అతను తిరుగు లేని రారాజు అని మెజారిటీ ఆడియెన్స్ అంగీకరించక తప్పదు. ఒక్క చిరంజీవి వచ్చాడు. తన వెనుక ఇంకో ఎనిమిది మంది మెగా హీరోలను తెలుగు పరిశ్రమలో నిలబెట్టగలిగాడు. అదీ మెగాస్టార్ స్టామినా. ఇప్పుడు తన 150 వ సినిమా అంటే.. ఎంతో ప్రెస్టీజియస్ మూవీ. అతని కమ్‌బ్యాక్ సినిమాతో చిరంజీవీ ఇంతకు ముందులా ఆడియెన్స్‌ని ఇంప్రెస్ […]

Advertisement
Update:2015-07-24 00:40 IST
రాజకీయాలలోకి వచ్చి చిరంజీవి తప్పు చేసాడనే భావన చాలా మందిలో ఉండొచ్చు కానీ.. సినిమాల విషయానికి వస్తే మాత్రం…అతను తిరుగు లేని రారాజు అని మెజారిటీ ఆడియెన్స్ అంగీకరించక తప్పదు. ఒక్క చిరంజీవి వచ్చాడు. తన వెనుక ఇంకో ఎనిమిది మంది మెగా హీరోలను తెలుగు పరిశ్రమలో నిలబెట్టగలిగాడు. అదీ మెగాస్టార్ స్టామినా. ఇప్పుడు తన 150 వ సినిమా అంటే.. ఎంతో ప్రెస్టీజియస్ మూవీ. అతని కమ్‌బ్యాక్ సినిమాతో చిరంజీవీ ఇంతకు ముందులా ఆడియెన్స్‌ని ఇంప్రెస్ చేయగలడా అని సినీ పరిశీలకులు ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఒకప్పూడు ‘లేడీ అమితాబ్’ గా తెలుగు తెరను ఏలిన విజయశాంతి కూడా మళ్ళీ సినిమాలకు తిరిగి వస్తోంది. రాజకీయంగా ఇప్పుడు కాస్త స్థబ్దుగా ఉండడంతో ఖాళీ సమయం దొరికిందట. అందుకే ఆరోగ్యం సంగతి పట్టించుకుని, ఒక సర్జరీ చేయించుకుని…ఇప్పుడిక సినిమాల గురించి యోచన మొదలయ్యింది ఆమెకు. రాజకీయంగా ఫేడ్ అవుట్ అవుతున్న తరుణంలో మెగాస్టార్ మరియు లేడీ అమితాబ్ ఇద్దరూ సినిమాలకు తిరిగి వస్తున్నారు. ఒకప్పుడు ఇద్దరూ తెరను ఏలిన వేల్పులే. మరి ఇప్పుడు ఎంత వరకు రాణించగలరు? చిరుకు సరే, మెగాఫ్యాన్ పవర్ ఉంది. మరి విజయశాంతి సంగతో అని ప్రశ్న బయలుదేరక తప్పదు. వేచి చూద్దాం.. ఇద్దరూ ఏ మేరకు ఇంప్రెస్ చేయగలరో!
Tags:    
Advertisement

Similar News