బ్రాండ్ అంబాసిడర్ గా బన్నీ
ఇప్పటికే కొన్ని ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు బన్నీ. తాజాగా ఇతడి ఖాతాలోకి మరో కార్యక్రమం కూడా వచ్చి చేరింది. అయితే ఇన్నాళ్లూ వాణిజ్య ఉత్పత్తులకు మాత్రమే ప్రచారం కల్పించిన అల్లు అర్జున్, ఫస్ట్ టైమ్ కబడ్డీకి ప్రచారం కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరుగుతున్న ప్రొ-కబడ్డీ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ముందుకొచ్చాడు బన్నీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు కబడ్డీ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఎవరైనా.. క్రీడా నేపథ్యంలో కథ రాసుకొని […]
Advertisement
ఇప్పటికే కొన్ని ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు బన్నీ. తాజాగా ఇతడి ఖాతాలోకి మరో కార్యక్రమం కూడా వచ్చి చేరింది. అయితే ఇన్నాళ్లూ వాణిజ్య ఉత్పత్తులకు మాత్రమే ప్రచారం కల్పించిన అల్లు అర్జున్, ఫస్ట్ టైమ్ కబడ్డీకి ప్రచారం కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరుగుతున్న ప్రొ-కబడ్డీ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ముందుకొచ్చాడు బన్నీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు కబడ్డీ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఎవరైనా.. క్రీడా నేపథ్యంలో కథ రాసుకొని తీసుకొస్తే అందులో నటించేందుకు సిద్ధమని కూడా ప్రకటించాడు. లగాన్, చక్ దే ఇండియా తరహాలాంటి కథలైతే నటించడానికి ఓకే అన్నాడు. మరోవైపు ప్రొ-కబడ్డీ లీగ్ లో కుదిరితే ఓ జట్టును కూడా దక్కించుకునే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించాడు అల్లు అర్జున్. మొత్తమ్మీద అల్లు అర్జున్ రాకతో ప్రొ-కబడ్డీ లీగ్ కు మరింత ఊపు, ఉత్సాహం వచ్చాయి. ఇప్పటికే ఈ లీగ్ కు మంచి ఆదరణ వస్తోందని అంటున్నారు స్టార్ గ్రూప్ నిర్వహకులు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ప్రోత్సాహం లభించిందని చెబుతున్నారు. మరోవైపు బన్నీ తన ప్రసంగాన్ని తొడకొట్టి ముగించడం విశేషం.
Advertisement