దేవుడే నన్ను మోసం చేశాడు " బాహుబలి ఆర్ట్ డైరెక్టర్
బాహుబలి సినిమా ఘనవిజయంలో ఆ సినిమా సెట్టింగులు ప్రధాన భూమిక పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. మహిహ్మతి నగరం, భారీ రాచరికపు సెట్టింగులు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని అందించిన బాహుబలి సెట్టింగులు ఆర్ట్ డైరెక్టర్ మనో జగద్‌కు మాత్రం తీరని వేదనను మిగిల్చాయి. ఆర్ట్ డైరెక్టర్‌గా ఆ సినిమా కోసం రాత్రింబగళ్లూ కష్టపడి, ఆఖరికి కళ్లకు తీవ్రమైన అనారోగ్యం కలిగినా లెక్క చేయక సంవత్సరాల తరబడి పని చేస్తే, తీరా సినిమా విడుదలయ్యాక […]
Advertisement
బాహుబలి సినిమా ఘనవిజయంలో ఆ సినిమా సెట్టింగులు ప్రధాన భూమిక పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. మహిహ్మతి నగరం, భారీ రాచరికపు సెట్టింగులు ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశాయి. ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని అందించిన బాహుబలి సెట్టింగులు ఆర్ట్ డైరెక్టర్ మనో జగద్‌కు మాత్రం తీరని వేదనను మిగిల్చాయి. ఆర్ట్ డైరెక్టర్‌గా ఆ సినిమా కోసం రాత్రింబగళ్లూ కష్టపడి, ఆఖరికి కళ్లకు తీవ్రమైన అనారోగ్యం కలిగినా లెక్క చేయక సంవత్సరాల తరబడి పని చేస్తే, తీరా సినిమా విడుదలయ్యాక తన పేరు ఆర్ట్ అసిస్టెంట్ అని ఉండడం చూసి హతాశుడనయ్యానని ఆయన వాపోయారు. తమిళ, మళయాళం సినీ పరిశ్రమల్లో 16 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పటికీ అక్కడ ఆర్ట్ డైరెక్టర్‌గానే ఉన్నాను. పదహారు సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసి ఘన విజయాలు సాధించిన తర్వాత నాకు బాహుబలి సినిమా అవకాశం దక్కింది. నేను ఇండస్ట్రీలో గురువుగా భావించే వ్యక్తి సాబుసైరల్. ఆయనే నాకు బాహుబలిలో ఆర్ట్ డైరెక్టర్ అవకాశముంది వెళ్లమంటేనే హైదరాబాద్ వచ్చాను. ఈ ప్రాజెక్టు కోసం సంవత్సరంపాటు అవిశ్రాంతంగా పని చేశాను. దీంతో నాకు తీవ్రమైన కంటి సమస్య ఏర్పడింది. ప్రతిక్షణం ఫైబర్ మెటల్స్, వాటి వెలుగుల మధ్య పని చేయడంతో కంటికి ఇన్‌ఫెక్షన్ సోకింది. ఎంతో మంది డాక్టర్లను సంప్రదించాను. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. అయినా నేను లెక్క చేయకుండా బాహుబలి ప్రాజెక్టుకు పని చేశాను.ఆర్ట్ డైరెక్టర్‌గా తొంభై శాతం పని పూర్తి చేశాను. మహిష్మతి రాజ్యంతో సహా ఆ సినిమాలోని ప్రతి సెట్టింగూ నేను వేసిందే. మిగిలిన పదిశాతం వర్క్ మేము పూర్త చేస్తామనడంతో నేను కంటికి ఆపరేషన్ చేయించుకుని 45 రోజులు విశ్రాంతి తీసుకున్నాను, సినిమా విడుదలైన రోజు కుటుంబ సభ్యులతో కలిసి చూస్తే టైటిల్స్‌లో నాపేరు ఆర్ట్ అసిస్టెంట్ అని ఉంది. నేను వెంటనే సాబు సైరల్‌కు ఫోన్ చేసి అడిగాను. ఆయన సమాధానం చెప్పకుండా ఎక్కడో పొరపాటు జరిగిందని అన్నాడు. బాహుబలి వంటి భారీ ప్రాజెక్టులో పొరపాట్లు జరగడం అసంభవం. గురువు, దైవం అని భావించిన వ్యక్తే నన్ను మోసం చేశాడని అర్థమైంది. ఆర్ట్ డైరెక్టర్‌గా మార్చిన వ్యక్తే నన్ను ఇప్పడు ఆర్ట్ అసిస్టెంట్‌గా మార్చాడు. ఇది ఎంతో బాధాకరం. బాహుబలి పార్ట్ 2కు కూడా ఎన్నో ముఖ్యమైన సెట్టింగులకు రూపకల్పన చేశాను. ఆ ప్రాజెక్టుకు మళ్లీ పిలిచినా వెళ్లను. దేవుడే నన్ను మోసగించిన తర్వాత నా బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదని మనో ఒక బ్లాగులో రాశారు.
Advertisement