కవరెక్కుతున్న మాజీలు

బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ల పేర్లు చెప్పమంటే ఎవరైనా దీపికా పదుకోన్, కత్రినాకైఫ్, కరీనాకపూర్, ప్రియాంకచోప్రా పేర్లు చెబుతారు. ఆ తర్వాత స్థాయిలో చెప్పమంటే అలియాభట్, పరిణీతిచోప్రా, కంగనారనౌత్, జాక్వెలిన్ లాంటి పేర్లు చెబుతారు. ఇంకాస్త కిందకొచ్చి థర్డ్ లెవెల్ పేర్లు చెప్పమంటే శ్రద్ధాకపూర్, ఇలియానా లాంటి భామల పేర్లు చెబుతారు. ఈ మూడు కేటగిరీల్లో ఏ కోవకు చెందని భామలు కొందరున్నారు. వీళ్లను జనాలు ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నారు. వాళ్లకు సినిమా ఆఫర్లు కూడా రావడం […]

Advertisement
Update:2015-07-22 00:30 IST
బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ల పేర్లు చెప్పమంటే ఎవరైనా దీపికా పదుకోన్, కత్రినాకైఫ్, కరీనాకపూర్, ప్రియాంకచోప్రా పేర్లు చెబుతారు. ఆ తర్వాత స్థాయిలో చెప్పమంటే అలియాభట్, పరిణీతిచోప్రా, కంగనారనౌత్, జాక్వెలిన్ లాంటి పేర్లు చెబుతారు. ఇంకాస్త కిందకొచ్చి థర్డ్ లెవెల్ పేర్లు చెప్పమంటే శ్రద్ధాకపూర్, ఇలియానా లాంటి భామల పేర్లు చెబుతారు. ఈ మూడు కేటగిరీల్లో ఏ కోవకు చెందని భామలు కొందరున్నారు. వీళ్లను జనాలు ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నారు. వాళ్లకు సినిమా ఆఫర్లు కూడా రావడం తగ్గిపోయాయి. ఇలాంటి భామలంతా ఇప్పుడు ఫోర్త్ లెవెల్ కిందకొస్తున్నారు. ఈ నాలుగోదశలో వీళ్లకి సినిమాలుండవు. ఉన్న కొద్దిపాటి క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి రిబ్బన్ కటింగ్ లు, కవర్ మేగజీన్లకు ఫోజులు ఇస్తుంటారు. ఈ కోవలోకి అసిన్, నేహాధూపియా, లీసా హెడెన్ లాంటి తారలొస్తారు. వీళ్లకి మిణుకుమిణుకుమనేంత క్రేజ్ ఉంటుంది. కానీ సినిమాల్లో నటించడానికి ఆ క్రేజ్ సరిపోదు. అందుకే కవర్ పేజీల్నే నమ్ముకున్నారు ఈ భామలు. సిల్వర్ స్క్రీన్ కు చాలని తమ అందాల్ని కవర్ పేజీలపై ఆరేసి ఉన్న క్రేజ్ ను నిలుపుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఏ మ్యాగజైన్ కవర్ పేజ్ చూసినా ఈ భామలే దర్శనమిస్తున్నారు. ఫిల్మీ పత్రికలతో పాటు లైఫ్ స్టయిల్ కు సంబంధించిన పత్రికలపై ఈ భామల బొమ్మలే కనిపిస్తున్నాయి. ఈ క్రేజ్ కూడా ఇంకెన్నాళ్లు నిలుస్తుందో చూడాలి.
Tags:    
Advertisement

Similar News