రూ.300 కోట్ల క్ల‌బ్‌లో బాహుబ‌లి!

బాహుబ‌లి మ‌రో ఘ‌న‌త సాధించింది. తాజాగా  ఈ చిత్రం రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరి సంచ‌ల‌నం సృష్టించింది. విడుద‌లై రెండువారాలు దాటుతోన్నా వ‌సూళ్ల‌లో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు నిద‌ర్శ‌నం. కేవ‌లం తొమ్మిదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.303కోట్లు కలెక్షన్స్ సాధించి స‌రికొత్త రికార్డు సృష్టించింది. రజనీకాంత్ నటించిన రోబో చిత్రానికి రూ.290కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఆ రికార్డును బాహుబలి బ్రేక్ చేయడం విశేషం. స‌ల్మాన్ తాజా చిత్రం బ‌జ్‌రంగీ భాయ్‌జాన్ తొలిరోజు […]

Advertisement
Update:2015-07-20 00:30 IST
రూ.300 కోట్ల క్ల‌బ్‌లో బాహుబ‌లి!
  • whatsapp icon
బాహుబ‌లి మ‌రో ఘ‌న‌త సాధించింది. తాజాగా ఈ చిత్రం రూ.300 కోట్ల క్ల‌బ్‌లో చేరి సంచ‌ల‌నం సృష్టించింది. విడుద‌లై రెండువారాలు దాటుతోన్నా వ‌సూళ్ల‌లో ఎలాంటి మార్పు లేక‌పోవ‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు నిద‌ర్శ‌నం. కేవ‌లం తొమ్మిదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.303కోట్లు కలెక్షన్స్ సాధించి స‌రికొత్త రికార్డు సృష్టించింది. రజనీకాంత్ నటించిన రోబో చిత్రానికి రూ.290కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఆ రికార్డును బాహుబలి బ్రేక్ చేయడం విశేషం. స‌ల్మాన్ తాజా చిత్రం బ‌జ్‌రంగీ భాయ్‌జాన్ తొలిరోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.60 కోట్లు కొల్ల‌గొట్టినా బాహుబ‌లి వ‌సూళ్లు స్థిరంగా కొన‌సాగుతుండ‌టం విశేషం. ఒక్క‌ హిందీలోనే బాహుబ‌లి రూ.50 కోట్ల మార్కును దాటేసింది. బాలీవుడ్ విడుద‌లైన ఒక డ‌బ్బింగ్ సినిమా ఇంత‌గా మార్కెటింగ్ చేయ‌డం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డే! ఒక తెలుగు చిత్రానికి ఈ స్థాయిలో ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో సినీ ఇండ‌స్ర్టీలో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    
Advertisement

Similar News