అమితాబ్ కు 6. 5 కోట్లు ఒక్క ప్ర‌క‌ట‌న‌కు...!

సెల‌బ్రిటిగా  అమితాబ్ బ్రాండ్ వాల్యూ కు స‌రైన ధ‌ర ప‌లికింది అంటున్నారు బాలీవుడ్  క్రిటిక్స్.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో   దూర‌ద‌ర్శ‌న్ కిసాన్  ఛానెల్ కు చేసిన ప్ర‌క‌ట‌న‌కు  అమితాబ్ కు వ‌చ్చిన పారితోష‌క‌మే  అత్య‌ధికం అంటున్నారు.  దేశ వ్యాప్తంగా రైత‌లు ఆత్మ హ‌త్య‌ల్ని నివారించేంద‌కు  ఉద్దేశించిన ఈ ఛానెల్ ను గ‌త నెల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి  లాంచ్ చేశారు. ఈయనను ప్రచారకర్తగా నియమించే విషయంలో లింటాస్ ఇండియా అనే కంపెనీ […]

Advertisement
Update:2015-07-18 00:30 IST

సెల‌బ్రిటిగా అమితాబ్ బ్రాండ్ వాల్యూ కు స‌రైన ధ‌ర ప‌లికింది అంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చేసిన వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో దూర‌ద‌ర్శ‌న్ కిసాన్ ఛానెల్ కు చేసిన ప్ర‌క‌ట‌న‌కు అమితాబ్ కు వ‌చ్చిన పారితోష‌క‌మే అత్య‌ధికం అంటున్నారు. దేశ వ్యాప్తంగా రైత‌లు ఆత్మ హ‌త్య‌ల్ని నివారించేంద‌కు ఉద్దేశించిన ఈ ఛానెల్ ను గ‌త నెల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడి లాంచ్ చేశారు.
ఈయనను ప్రచారకర్తగా నియమించే విషయంలో లింటాస్ ఇండియా అనే కంపెనీ దూరదర్శన్ అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఈ ఛానల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు కొనసాగుతారు. ఓ ఇంగ్లీష్ దినపత్రికకు ఈ వివరాలు అందాయి. షరతుల ప్రకారం.. ఒక్కరోజు షూటింగ్, ప్రచారం వంటివాటికోసం అమితాబ్ ఇందులో పాల్గొనవలసివుంటుంది.

టీవీ, ఔట్‌డోర్, ప్రింట్, రేడియో, సినిమా, ఇంటర్నెట్ వేదికల ద్వారా ఆయన ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. అయితే ఇంత పెద్ద నటుడ్ని పెట్టినా కిసాన్ ఛానల్ వ్యూయర్‌షిప్ తగ్గిపోతోందని ఈ దినపత్రికకు అందిన ఈ-మెయిల్స్ ద్వారా వెల్లడయింది. దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల దుర్బర పరిస్థితిని అదుపు చేసేందుకు ఉద్దేశించిన ఈ ఛానల్‌లో సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ జోక్యం పెరిగిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి ప్రయోజనాలను ఈ ఛానల్ కాపాడలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News