సల్మాన్ భాయ్ కూడా తెలుసుకున్నాడు..!
బాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరోకు ఒక్కో రకమైన స్టైల్ ఉంది. షారుక్ ఖాన్ ప్రేమ కథా చిత్రాల్ని పండించడంలో దిట్ట. అలాగే వైవిధ్యమైన చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ ను దుమ్ము లేపడం అమీర్ ఖాన్ స్టైల్. ఇక హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలంటే మన సల్లుభాయే. ఆయన చిత్రాలంటే.. దిట్టంగా దట్టించిన దమ్ బిరియాని లా వుంటాయి. 5 సంవత్సరాల క్రితం వచ్చిన దబంగ్ చిత్రం. సల్మాన్ ఖాన్ చిత్రాల మార్కెట్ రేంజ్ ను సాలిగ్ […]
బాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరోకు ఒక్కో రకమైన స్టైల్ ఉంది. షారుక్ ఖాన్ ప్రేమ కథా చిత్రాల్ని పండించడంలో దిట్ట. అలాగే వైవిధ్యమైన చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డ్స్ ను దుమ్ము లేపడం అమీర్ ఖాన్ స్టైల్. ఇక హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలంటే మన సల్లుభాయే. ఆయన చిత్రాలంటే.. దిట్టంగా దట్టించిన దమ్ బిరియాని లా వుంటాయి. 5 సంవత్సరాల క్రితం వచ్చిన దబంగ్ చిత్రం. సల్మాన్ ఖాన్ చిత్రాల మార్కెట్ రేంజ్ ను సాలిగ్ డా పెంచేసింది. ఆ తరువాత సల్లుభాయ్ చేసిన సినిమాలు అన్ని హై వోల్టేజ్ ఫిల్మ్సే అని చెప్పాలి.
ఓవరాల్ గా చెప్పుకంటే.. యాక్షన్ లేని కథను ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ చేయలేదు. తన ఎనర్జీ కి తగ్గట్లు.. తన నుంచి ఫ్యాన్స్ ఆశించే ఎలిమెంట్స్ తో పక్క లేక్కలతో సినిమా చేశాడు. కానీ ఈ రోజు విడుదలైన భజరంగ్ భాయిజాన్ చిత్రం తన సినిమా కథల బెసిక్ స్ట్రక్చర్ కు భిన్నంగా చేశాడు. అసలు సల్మాన్ ఖాన్ ఇటువంటి సినిమా చేస్తాడా..? చేసి మెప్పిస్తాడా? అనే కథా బలం వున్న చిత్రం చేశాడు. ఈ సినిమా కథను మన విజయేంద్ర ప్రసాద్ ( బాహుబలి సినిమా కథ రచయిత) రాయడం విశేషం. కబీర్ ఖాన్ డైరెక్షన్ లో చేసిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ యాక్టింగ్ కు అంతా ఫిదా అయ్యారనే టాక్ వినిపిస్తుంది.
సినిమాలో సల్మాన్ మార్కు ఊర డ్యాన్సులు, ఊర కామెడీ, హీరోయిన్ స్కర్టుతో నోటి పట్టుకొని స్టెప్పులు వేయడం, కొడితే పది మంది గాల్లోకి గింగిరాలు తిరగడం.. అబ్బే ఏమీ లేవు. ఒక చిన్న పిల్లను తీసుకొని పాకిస్తాన్‌లో ఆమె తల్లిదండ్రులకు అప్పగించేద్దాం అని బయలుదేరిన పవన్ కుమార్ ఛతుర్వేది (సల్మాన్) ఎలియాస్ బజరంగీ ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నాడనేదే కథాంశం. వండర్‌ఫుల్ స్టోరీ .. సో దీంతో తను కేవలం యాక్షన్ చిత్రాలే చేస్తే..నటుడిగా తనకు త్వరలోనే రిటైర్మెంట్ ఉంటుందనే విషయాన్ని మన సల్లుభాయ్ అర్ధం చేసుకున్నాడనడంలో సందేహాం లేదు మరి.