యూఎస్ టాప్-10 మూవీస్ లో బాహుబలి

కేవలం ఓ తెలుగు సినిమాలా ఇలా వచ్చి అలా వెళ్లిపోలేదు బాహుబలి. ఇది అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. దిగ్గజాలతో శభాష్ అనిపించుకుంటోంది. క్రిటిక్స్ తో మన్ననలు పొందుతోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది బాహుబలి. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో మీడియాను ఎట్రాక్ట్ చేసేది బాలీవుడ్ సినిమా మాత్రమే. షారూక్,సల్మాన్ లాంటి హీరోల సినిమాకు ఓవర్సీస్ పొటన్షియాలిటీ ఎక్కువ. కాబట్టి వాటిపై విశ్లేషణలు రాస్తుంటాయి అక్కడి మీడియాలు. కానీ ఫస్ట్ టైమ్ బాహుబలి సినిమాపై వాకబు […]

Advertisement
Update:2015-07-13 02:30 IST
కేవలం ఓ తెలుగు సినిమాలా ఇలా వచ్చి అలా వెళ్లిపోలేదు బాహుబలి. ఇది అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. దిగ్గజాలతో శభాష్ అనిపించుకుంటోంది. క్రిటిక్స్ తో మన్ననలు పొందుతోంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది బాహుబలి. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో మీడియాను ఎట్రాక్ట్ చేసేది బాలీవుడ్ సినిమా మాత్రమే. షారూక్,సల్మాన్ లాంటి హీరోల సినిమాకు ఓవర్సీస్ పొటన్షియాలిటీ ఎక్కువ. కాబట్టి వాటిపై విశ్లేషణలు రాస్తుంటాయి అక్కడి మీడియాలు. కానీ ఫస్ట్ టైమ్ బాహుబలి సినిమాపై వాకబు చేయడం మొదలుపెట్టాయి విదేశీ పత్రికలు, వెబ్ సైట్లు. తొలిసారి ఓ ఇండియన్ సినిమా.. అది కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చిన సినిమా అమెరికాలో బ్రహ్మాండంగా ఆడుతోందంటూ రివ్యూస్ రాయడం ప్రారంభించాయి. కొన్ని విదేశీ వెబ్ సైట్లు, పత్రికలైతే తెలియక.. బాలీవుడ్ మూవీ అనే రాసుకొచ్చాయి బాహుబలి సినిమాని. మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియాతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాలకు చెందిన సైట్లు బాహుబలిని బాలీవుడ్ మూవీగానే రాసుకొచ్చాయి. తర్వాత విషయం తెలుసుకొని షాకయ్యి.. వెంటనే సౌత్ సినిమా అంటూ సరిదిద్దుకున్నాయి. ప్రస్తుతం యూఎస్ టాప్-10 మూవీస్ లో ఒకటిగా కొనసాగుతోంది బాహుబలి మూవీ.
Tags:    
Advertisement

Similar News