భళా బాహుబలి..!
బాహుబలి థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుది. దేశ వ్యాప్తంగా రెండు రోజు పూర్తి అయ్యే సరికి దాదాపు 50 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో సల్మాన్ ఖాన్,, అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్ లు చేసిన కొన్ని చిత్రాల కలెక్షన్ల రికార్డ్స్ బద్దలయ్యాయి. రాజమౌళి అండ్ టీమ్ చెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ లో పది సంవత్సరాల పాటు కష్టపడితే వచ్చే అవుట్ పుట్ ను జస్ట్ రెండు సంవత్సరాల్లో […]
బాహుబలి థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుది. దేశ వ్యాప్తంగా రెండు రోజు పూర్తి అయ్యే సరికి దాదాపు 50 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో సల్మాన్ ఖాన్,, అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్ లు చేసిన కొన్ని చిత్రాల కలెక్షన్ల రికార్డ్స్ బద్దలయ్యాయి. రాజమౌళి అండ్ టీమ్ చెక్కిన ఈ చిత్రం హాలీవుడ్ లో పది సంవత్సరాల పాటు కష్టపడితే వచ్చే అవుట్ పుట్ ను జస్ట్ రెండు సంవత్సరాల్లో తీసుకొచ్చి ఆశ్చర్య పరిచాడు. బాహుబలి మొదటి పార్ట్ ఎండింగ్ లో వచ్చే పోరాట సన్నివేశం… బాహుబలిని క్లాసిక్ చేస్తుంది అంటున్నారు పరిశీలకులు. విజువల్స్ పరంగా చెప్పడానికి మాటలే లేవు అంటున్నారు జనాలు. ఇక ప్రభాస్, రానా, రమ్య కృష్ణ, కట్టప్ప రోల్ లో సత్యరాజ్.. బిజ్జల దేవ క్యారెక్టర్ లో నాజర్ ల నటన .. ఓవరాల్ గా బాహుబలి మొదటి భాగం తెలుగు సినిమా ను ప్రపంచం గర్వ పడేలా చేసింది అనడంలో సందేహామే లేదు..దీంతో ఈ చిత్రం శాటి లైట్ రైట్స్ కు వీపరీతమైన డిమాండ్ పెరిగింది.
బాహుబలి మూవీ శాటిలైట్ హక్కులు చేజిక్కించుకునేందుకు చానెళ్ళు పోటీ పడుతున్నాయి. తెలుగు వెర్షన్ హక్కులను జీ తెలుగు రూ.16 కోట్లకు, హిందీ వెర్షన్ హక్కులను సోనీ పిక్స్ రూ.17 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. అలాగే తమిళ శాటిలైట్ హక్కులకోసం కూడా వివిధ చానెల్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే బాహుబలి తెలుగు శాటిలైట్ రైట్స్‌ను మా టీవీ రూ.25 కోట్లకు కైవసం చేసుకుందని ఇటీవల వార్తలు వచ్చాయి. మొత్తం మీద అన్నభాషల్లో కలిపి శాటిలైట్ హక్కుల రూపంలోనే దాదాపు 50 కోట్లకు పైగా బాహుబలి సినిమా బిజినెస్ చేసిందనేది సమాచారం.ఇది ఇండియన్ ఫిల్మ్ హిస్టరిలో ఒక రికార్డు అంటున్నారు క్రిటిక్స్