బాహుబలిపై వర్మ ట్వీట్స్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి ఇప్పుడు బాహుబలి సినిమాపై పడింది. సెలబ్రిటీలు, ప్రేక్షకులు అంతా బాహుబలి జపం చేస్తున్న ఈ తరుణంలో వర్మ కూడా మొబైల్ అందుకున్నాడు. బాహుబలి నేపథ్యంలో ట్వీట్స్ కు పదునుపెట్టాడు. ఈమధ్య సినిమాలతో కంటే ట్వీట్స్ తోనే ఎక్కువగా పాపులర్ అవుతున్న ఈ దర్శకుడు, బాహుబలిపై ప్రశంసల ట్వీట్స్ గుప్పిస్తూనే.. మిగతా హీరోలు, దర్శకులపై విమర్శల ట్వీట్స్ వదిలాడు. పులులు, సింహాలు, ఏనుగులు, కొండచిలువలతో నిండిపోయిన పరిశ్రమలోకి బాహుబలి లాంటి డైనోసార్ […]
Advertisement
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి ఇప్పుడు బాహుబలి సినిమాపై పడింది. సెలబ్రిటీలు, ప్రేక్షకులు అంతా బాహుబలి జపం చేస్తున్న ఈ తరుణంలో వర్మ కూడా మొబైల్ అందుకున్నాడు. బాహుబలి నేపథ్యంలో ట్వీట్స్ కు పదునుపెట్టాడు. ఈమధ్య సినిమాలతో కంటే ట్వీట్స్ తోనే ఎక్కువగా పాపులర్ అవుతున్న ఈ దర్శకుడు, బాహుబలిపై ప్రశంసల ట్వీట్స్ గుప్పిస్తూనే.. మిగతా హీరోలు, దర్శకులపై విమర్శల ట్వీట్స్ వదిలాడు. పులులు, సింహాలు, ఏనుగులు, కొండచిలువలతో నిండిపోయిన పరిశ్రమలోకి బాహుబలి లాంటి డైనోసార్ ఎంటరయ్యాడని చెప్పుకొచ్చాడు వర్మ. ఇకపై మిగతా పులులు, సింహాలకు ప్రాణసంకటమే అని రాసుకొచ్చాడు. అంతేకాదు.. ఫస్ట్ టైమ్ ప్రభాస్ సినిమా అతడి కంటే పెద్దగా కనిపించిందని.. శ్రీమంతుడు సినిమాలో మహేష్ మాత్రమే కనిపిస్తాడని, కిక్ లో రవితేజ మాత్రమే కనిపిస్తాడని.. బాహుబలిలో ప్రభాస్ తో పాటు ఇంకా చాలా పెద్దపెద్ద విషయాలున్నాయని రాసుకొచ్చాడు. తన ట్వీట్స్ తో రాజమౌళిని ఆకాశానికెత్తేస్తూనే.. మిగతా దర్శకులపై పంచ్ లేశాడు వర్మ. రాజమౌళి మూడేళ్లు కష్టపడి బాహుబలి సినిమా తీస్తే మిగతా దర్శకులు కుళ్లుకున్నారని, అదే నాలుగేళ్లు కష్టపడి రాజమౌళి మరో సినిమా తీస్తే ఇండస్ట్రీ అంతా ఖాళీ అయిపోవడ ఖాయమన్నాడు. బాహుబలి సినిమా తర్వాత పవన్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎంత పెద్ద సినిమాలు తీసినా అవన్నీ లో-బడ్జెట్ మూవీస్ లా కనిపిస్తాయని ట్వీట్ చేశాడు వర్మ.
Advertisement