తెలుగు రాజకీయాల్లో బాహుబలి
సినిమాలు వస్తుంటాయి..పోతుంటాయి. రాజకీయ నాయకులు, రాజకీయాలతో వాటికి సంబంధం ఉండదు. కానీ బాహుబలి సినిమా మాత్రం రాజకీయాల్ని కూడా తనవైపు లాక్కుంది. బిజిబిజీగా ఉండే పొలిటీషియన్లు కూడా బాహుబలి సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ రాజకీయ విమర్శల్ని కాసేపు పక్కనపెట్టి సినిమాని పొగడ్డం మొదలుపెడుతున్నారు. ఏపీ, తెలంగాణ అనే తేడాలేకుండా రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు చాలామంది బాహుబలి సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీ కవిత […]
Advertisement
సినిమాలు వస్తుంటాయి..పోతుంటాయి. రాజకీయ నాయకులు, రాజకీయాలతో వాటికి సంబంధం ఉండదు. కానీ బాహుబలి సినిమా మాత్రం రాజకీయాల్ని కూడా తనవైపు లాక్కుంది. బిజిబిజీగా ఉండే పొలిటీషియన్లు కూడా బాహుబలి సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ రాజకీయ విమర్శల్ని కాసేపు పక్కనపెట్టి సినిమాని పొగడ్డం మొదలుపెడుతున్నారు. ఏపీ, తెలంగాణ అనే తేడాలేకుండా రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు చాలామంది బాహుబలి సినిమాను చూసి మెచ్చుకుంటున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీ కవిత తమ కుటుంబసభ్యులతో కలిసి బాహుబలి సినిమా చూశారు. సినిమా బాగా తీశారంటూ యూనిట్ ను మెచ్చుకున్నారు. నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రత్యేక షోను చూడాల్సి ఉన్నప్పటికీ కుదరలేదు. దీంతో కేసీఆర్ మినహా మిగతా కుటుంబసభ్యులంతా బాహుబలిని ఎంజాయ్ చేశారు. మరోవైపు ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసమేతంగా ఈరోజు ఈ సినిమాని చూస్తారు. ఈ రోజు ఆదివారం కూడా కావడంతో వీళ్లతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు ఈరోజు బాహుబలి సినిమాను చూసే అవకాశముంది.
Advertisement