జూపల్లన్నా... ఎదురు చూస్తున్నా: రావుల
మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి వేచి చూస్తున్నానని , ఆయన మధ్యాహ్నం దాటినా ఇంతవరకు రాలేదని ఆ పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో రావుల రాసిన లేఖను తప్పుపడుతూ జూపల్లి… ఆ లేఖ చదివిన వారికి చంద్రబాబు ఓ హరిశ్చంద్రుడు మాదిరి, రావుల ఆ హరిశ్చంద్రుడికి తమ్ముడి మాదిరి కనపడతారంటూ వ్యగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగానే భీమా […]
Advertisement
మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి వేచి చూస్తున్నానని , ఆయన మధ్యాహ్నం దాటినా ఇంతవరకు రాలేదని ఆ పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో రావుల రాసిన లేఖను తప్పుపడుతూ జూపల్లి… ఆ లేఖ చదివిన వారికి చంద్రబాబు ఓ హరిశ్చంద్రుడు మాదిరి, రావుల ఆ హరిశ్చంద్రుడికి తమ్ముడి మాదిరి కనపడతారంటూ వ్యగ్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగానే భీమా ఎత్తిపోతల పథకానికి ఒక్క పైసా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని, దానికి నిధులు కేటాయించి ఖర్చు పెట్టినట్టు చూపిస్తే ముక్కు నేలకేసి రాసుకుని క్షమాపణ చెబుతానని, ఇందుకు తాను శనివారం ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వస్తానని, దమ్ముంటే రావుల అక్కడే ఉండి తనకు లెక్కలు చూపాలని జూపల్లి సవాలు విసిరారు. దీనిపై వెంటనే స్పందించిన రావుల తాను సిద్ధమేనని, తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆహ్వానిస్తున్నానని ప్రతి సవాలు చేశారు. తాను శనివారం చేసిన ప్రకటనకు కట్టుబడి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ఉదయం పది గంటల నుంచి వేచి చూస్తున్నానని, మంత్రి రాలేదని రావుల అన్నారు. మంత్రి చేసిన సవాలుకు కట్టుబడలేదంటే మాట తప్పారా… లేక భయపడ్డారా అని ప్రశ్నించారు. ఏదైనా విషయంపై సవాలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఈరోజు కాకపోయినా ఎప్పుడొచ్చినా నిజాలను ఆయన కళ్ళకు కట్టేట్టు చేస్తామని రావుల చెబుతూ తన కేరాఫ్ అడ్రసు తెలుగుదేశం పార్టీ కార్యాలయమేనని, కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యాలయాల చుట్టూ తిరిగి తానెప్పుడూ పార్టీలు మారే ఏర్పాటు చేసుకోలేదని రావుల దెప్పి పొడిచారు.
Advertisement