బాహుబలి సెట్స్ కూడా ఒక వండరే...!
తెలుగు సినిమా చరిత్రలో కని విని ఎరగని రీతిలో రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంతర్జాతీయంగా లైమ్ లైట్ కావడం అనేది మన టాలీవుడ్ లో ఇదే తొలిసారి అని చెప్పాలి. ఒక సంవత్సరం పాటు ప్రి ప్రొడక్షన్ వర్క్.. రెండు సంవత్సరాల పాటు షూటింగ్.. ప్రపంచ వ్యాప్తంగా 26 విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ లో విఎఫ్ ఎక్స్ వర్క్… రోజుకు వెయ్యి మంది పని చేయడం. రెండు వేల మంది […]
తెలుగు సినిమా చరిత్రలో కని విని ఎరగని రీతిలో రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రం అంతర్జాతీయంగా లైమ్ లైట్ కావడం అనేది మన టాలీవుడ్ లో ఇదే తొలిసారి అని చెప్పాలి. ఒక సంవత్సరం పాటు ప్రి ప్రొడక్షన్ వర్క్.. రెండు సంవత్సరాల పాటు షూటింగ్.. ప్రపంచ వ్యాప్తంగా 26 విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ లో విఎఫ్ ఎక్స్ వర్క్… రోజుకు వెయ్యి మంది పని చేయడం. రెండు వేల మంది తో యుద్ద సన్నివేశాలు షూటింగ్ జరపడం. దేశవ్యాప్తంగా జాతీయ నెషనల్ అవార్డు అందుకున్న 25 మంది దిగ్గజ టెక్నిషియన్స్ పని చేయడం. 11 వందల పని దినాలు . నాలుగు భాషల్లో ఒకేసారి బాహుబలి ని రిలీజ్ చేస్తుండటం. ఇదంత ఒకెత్తు అయితే.. రాజమౌళి బాహుబలి సినిమాకు వేయించిన సెట్స్ మరొక ఎత్తు.
ఏదైనా భారీ తనం ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. పిరియాడిక్ చిత్రాలు లైక్. బెన్ హర్..గ్లాడియేటర్.. టెన్ కమాండ్ మెంట్స్..హెరక్యులస్, 300 నైట్స్ వంటి చిత్రాల్లో ఎంతో భారీ తనం కనిపిస్తుంది. సెట్స్ ఎంతో భారీగా వుంటాయి. వార్ ఎపిసోడ్స్ కూడా ఔరా అనిపించే విధంగా వుంటాయి.
ఇక మమ్మీ… జూరాసిక్ పార్క్..అవతార్ వంటి భారీ ఫిక్షన్ చిత్రాలు కూడా ఎంతో భారీ గా ఉంటాయి. ముఖ్యంగా ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన అవతార్ చిత్రం అయితే విజువల్ పరంగా.. సెట్టింగ్స్ పరంగా ఎంతో భారీగా ఉన్నాయి. అలాగే జేమ్స్ కెమరూన్ చేసిన టైటానిక్ చిత్రం కూడా.. ఆ సినిమాలో టైటానిక్ షిప్ ప్రయాణం చేసే సముద్రం అంత సెట్ వేసి సృష్టించిందే….! ఆ రేంజ్ సెట్టింగ్స్ మన తెలుగు సినిమా కు వేయించారు దర్శక దిగ్గజం రాజమౌళి. ఈ సినిమా లో మాహిష్మతి అనే ఒక సామ్యాజ్యని సెట్టింగ్స్ తో నిర్మించారు. ఆ భవనం చూస్తుంటే నయనా నందకరంగా విజువల్స్ లో కనిపిస్తుంది.
తెలుగు సినిమాలో ఒక సెట్టింగ్ కోసం 15 వేల స్కెచ్ లు గీయించడం అనేది ఒక రికార్డే. బాహుబలి సినిమా లో మాహిష్మతి రాజ్యం కోసం ఆర్ట్ డైరెక్టర్ శిబు సోరెల్ 15 వేల స్కెచ్ లు గీయించి దర్శకుడికి చూపించారట. అలా నిర్మించిందే మనం చూస్తున్న మాహిష్మతి భవనం. సినిమాలో ప్రత్యేక ఆకర్షణల్లో మాహిష్మతి ప్యాలెస్ అగ్రగామి అని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమా లో ప్రతి నాయకుడు రోల్ చేసిన భళాల దేవ విగ్రహాం మరో ప్రత్యేకత. ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల్లో కూడా కనపించనంత ఎతైన విగ్రహం మన బాహుబలి లో చూపించారు. వంద అడుగలకు పైనున్న ఈ భళ్లాల దేవ విగ్రహాన్ని పైకి లేపడానికి మూడు భారీ క్రేన్స్ ఉపయోగించారు. అలాగే ఈ విగ్రహం నిలబెట్టి ఒక్క షాట్ షూట్ చేయడానికి తొమ్మది రోజులు పట్టిందంటే ..ఈ విగ్రహం ఎంత భారీగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాలకే పరిమితం అయినా.. భారీ సెట్టింగ్స్.. దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలి చిత్రంతో ఇండియన్ సినిమాకు పరిచయం చేశాడు. అందుకే బాహుబలి ది ప్రౌడ్ ఆఫ్ ఇండియా మరి.!