బాలీవుడ్ కు రాజమౌళి
ఓ వైపు బాహుబలి సినిమా మరికొన్ని గంటల్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమౌతుంటే.. దర్శకుడు రాజమౌళి మరో సంచలనాత్మక ప్రకటన చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాహుబలి పార్ట్-2 తర్వాత బాలీవుడ్ సినిమా చేస్తానని ప్రకటించాడు రాజమౌళి. కుదిరితే ఏకంగా అమీర్ ఖాన్ తోనే సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. తన బాలీవుడ్ డెబ్యూకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రాజమౌళి. నిజానికి ఈగ సినిమా తర్వాతే బాలీవుడ్ లో సినిమా చేద్దామనుకున్నాడట జక్కన్న. పేర్లు […]
Advertisement
ఓ వైపు బాహుబలి సినిమా మరికొన్ని గంటల్లో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమౌతుంటే.. దర్శకుడు రాజమౌళి మరో సంచలనాత్మక ప్రకటన చేశాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాహుబలి పార్ట్-2 తర్వాత బాలీవుడ్ సినిమా చేస్తానని ప్రకటించాడు రాజమౌళి. కుదిరితే ఏకంగా అమీర్ ఖాన్ తోనే సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. తన బాలీవుడ్ డెబ్యూకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రాజమౌళి. నిజానికి ఈగ సినిమా తర్వాతే బాలీవుడ్ లో సినిమా చేద్దామనుకున్నాడట జక్కన్న. పేర్లు చెప్పకపోయినా ఒకరిద్దరు హీరోల్ని కూడా సంప్రదించాడట. అయితే అదే సమయంలో బాహుబలి ఆలోచన రావడంతో ఇక పూర్తిగా బాహుబలి ప్రాజెక్ట్ కే టైమ్ కేటాయించాడు. అలా బాహుబలి వల్ల బాలీవుడ్ కు వెళ్లడం మూడేళ్లు ఆలస్యమైందంటున్నాడు రాజమౌళి. ఈసారి మాత్రం కచ్చితంగా బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. సూపర్ హిట్ మూవీ మగధీరను బాలీవుడ్ లో రాజమౌళే రీమేక్ చేస్తే బాగుంటుందని చాలా మంది ఇప్పటికే సూచించారు. ఆ సూచనపై మాత్రం రాజమౌళి స్పందించలేదు.
Advertisement