స‌ల్మాన్ పై క‌రీనా క‌పూర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం...!

బాలీవుడ్ కండ‌ల వీరుడు  స‌ల్మాన్ ఖాన్ తో   క‌రీనా క‌పూర్ ఇప్ప‌టి వ‌ర‌కు చాల త‌క్కువ చిత్రాలే చేశారు. ప్ర‌స్తుతం  వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో భ‌జ‌రంగీ భాయ్ జాన్ అనే చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉంది.  ఈ సంద‌ర్భంగా   క‌రీన  క‌పూర్ స‌ల్మాన్ ఖాన్ గురించి  పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.  స‌ల్మాన్ ప‌దేళ్ల క్రితం ఎలా వున్నారో ..ఇప్పుడు అలానే వున్నారు..న‌వ్వుతు ..న‌వ్విస్తూ  ..సెట్ లో అంద‌రి బాగోగులు చూసుకుంటూ చ‌లాకిగా వున్నారంటూ కితాబిచ్చారు.  ఆయ‌న‌కు […]

Advertisement
Update:2015-07-09 14:30 IST

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తో క‌రీనా క‌పూర్ ఇప్ప‌టి వ‌ర‌కు చాల త‌క్కువ చిత్రాలే చేశారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో భ‌జ‌రంగీ భాయ్ జాన్ అనే చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ సంద‌ర్భంగా క‌రీన క‌పూర్ స‌ల్మాన్ ఖాన్ గురించి పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. స‌ల్మాన్ ప‌దేళ్ల క్రితం ఎలా వున్నారో ..ఇప్పుడు అలానే వున్నారు..న‌వ్వుతు ..న‌వ్విస్తూ ..సెట్ లో అంద‌రి బాగోగులు చూసుకుంటూ చ‌లాకిగా వున్నారంటూ కితాబిచ్చారు.

ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎన్ని స‌మ‌స్య‌లున్న అవి సెట్ లో ఎక్క‌డ త‌న ముఖంలో క‌నిపించ‌నివ్వ‌ర‌ని చెప్పింది. అలాగే ఆ మ‌ధ్య త‌న‌కు జైలు శిక్ష ప‌డుతుందేమో అన్న స‌మ‌యంలో కూడా ఎంతో గుండె నిబ్బ‌రంగా ఉన్నార‌ని..అది సాధార‌ణ విష‌యం కాద‌ని స‌ల్మాన్ గొప్ప త‌నాని మ‌రింత గా మెచ్చుకున్నారు. ఇక స‌ల్మాన్ ఖాన్ కు వున్న ఫాలోయింగ్ చూస్తుంటే త‌న‌కు అసూయ పుడుతుంటుంద‌ని చెప్పుకొచ్చారు. మొత్తం మీద స‌ల్మాన్ ఖాన్ కు క‌రీనా క‌పూర్ అభిమాని అయిన‌ట్లున్నారండోయ్..!

Tags:    
Advertisement

Similar News